India Vs AUS warm Up: ఎంత మంది మాజీలు సూచించినా.. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం మహ్మద్ షమీని టీ20 వరల్డ్ కప్ టీంలోకి తీసుకోలేదు. ఆసియాకప్ లో టీమిండియా డెత్ ఓవర్లలో ఘోరంగా విఫలమై పాకిస్తాన్, శ్రీలంకల చేతిలో ఓడి ఇంటిదారి పట్టాక భారత్ తీరు అందరూ తప్పు పట్టారు. డెత్ ఓవర్లలో ధారళంగా పరుగులు ఇస్తున్న భువనేశ్వర్, అర్షదీప్ లాంటి వారిని కాకుండా సీనియర్ మహ్మద్ షమీని తీసుకోవాలంటూ సూచించారు. కానీ టీమిండియా మాత్రం ఈ వెటరన్ ను తీసుకోలేదు.

కానీ నవ్విన నాపచేనే పండినట్టు.. బుమ్రా, రవీంద్రజడేజా, దీపక్ చాహర్ లు గాయంతో వైదొలగడం షమీకి వరమైంది. అతడికి పిలుపువచ్చింది. తాజాగా ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ లోనూ కెప్టెన్ రోహిత్ ఈ సీనియర్ ఆటగాడిని తీసుకోలేదు.. బౌలింగ్ వేయించలేదు. కానీ చివరి ఓవర్ లో 10 పరుగులు చేయాల్సిన దశలో ఫాంలో ఉన్న ఆస్ట్రేలియా చేతిలో ఐదు వికెట్లు ఉన్న వేళ అందరూ అసీస్ దే విజయం అని అనుకున్నారు..భారత గెలుపుపై ఆశలు లేవు.
అందుకే అప్పటిదాకా ఒక్క ఓవర్ కూడా వేయించని రోహిత్ శర్మ.. ఎలాగూ ఆస్ట్రేలియా గెలుస్తుందని మహ్మద్ షమీని పిలిచి లాస్ట్ ఓవర్ వేయించాడు. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగిన షమీ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. తొలి రెండు బంతులకు డబుల్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కమిన్స్ (4)ను రనౌట్ చేశాడు. అనంతరం జోష్ ఇంగ్లిస్, కేన్ రిచర్డ్ సన్ లను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో అసీస్ 180 పరుగులకే ఆలౌటైంది. గెలవాల్సిన అసీస్ ఓడిపోయింది. కాదు షమీ నే భారత్ ను గెలిపించాడు.
చివరి ఓవర్లో హ్యాట్రిక్ తోపాటు 4 వికెట్లు తీసి డెత్ ఓవర్లలో భారత ఓటములకు అడ్డుకట్ట వేశాడు. బుమ్రా కంటే మించి డెత్ ఓవర్లలో మెరుగ్గా బౌలింగ్ చేయగలనని నిరూపించాడు.