India vs South Africa: మెడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న గిల్ రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో రిషబ్ పంత్ టీమ్ ఇండియాకు సారధిగా వ్యవహరించనున్నాడు. రేపటి నుంచి గుహవాటి వేదికగా టీమిండియా, సౌత్ ఆఫ్రికా మధ్య రెండవ టెస్ట్ మొదలుకానుంది. ఈ టెస్ట్ లో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని టీమిండియా భావిస్తోంది.
Also Read: హేజిల్ వుడ్ లేడు.. కమిన్స్ ఆడలేదు.. ఇతడొకడే ఇంగ్లాండ్ కు… పోయించాడు!.
గిల్ స్థానంలో సారధిగా పంత్ ఖరారైనప్పటికీ.. గిల్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే విషయంపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. సాయి దర్శన్ గిల్ స్థానంలో ఆడతాడని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై మేనేజ్మెంట్ ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇదంతా కూడా ఊహాగానమేనని అర్థమైంది.. సాయి సుదర్శన్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో గిల్ స్థానంలో అతడే ఆడతాడని చాలామంది అంచనాకు వచ్చారు. క్రికెట్ విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రఖ్యాత స్పోర్ట్స్ వెబ్సైట్ క్రిక్ బజ్ నివేదిక ప్రకారం గిల్ స్థానంలో ఆడేది సాయి సుదర్శన్ కాదని తెలుస్తోంది. సాయి సుదర్శన్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ అతడిని తుది జట్టులోకి తీసుకుంటారనే నమ్మకాన్ని క్రిక్ బజ్ వ్యక్తం చేయలేదు. డొమెస్టిక్ క్రికెట్లో సాయి అదరగొడుతున్నప్పటికీ.. అతడు మాత్రమే కాకుండా గిల్ స్థానంలో ఆడేందుకు దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. గుహవాటి టెస్టులో టీమిండియా ఎలాగైనా గెలవాలి కాబట్టి.. గిల్ స్థానంలో సమర్థవంతమైన ఆటగాడిని మేనేజ్మెంట్ భర్తీ చేస్తుందని.. జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి..
Also Read: టెస్టులే కాదు.. వన్డే సిరీస్ ఆడేది అనుమానమే.. గిల్ స్థానంలో కెప్టెన్ ఎవరంటే?
సాయి సుదర్శన్ పేరును గిల్ సిఫారసు చేసినట్టు వార్తలు వచ్చినప్పటికీ అవి నిజం కాదని తెలింది. వాస్తవానికి గిల్ ఎవరి పేరు కూడా సిఫారసు చేయలేదని సమాచారం. దీంతో సాయి సుదర్శన్ కు అవకాశం కల్పించలేదని.. నితీష్ కుమార్ రెడ్డి, దేవ దత్ వంటి వారిని కూడా మేనేజ్మెంట్ పరిగణలోకి తీసుకుందని.. తుది జట్టులో తీసుకోవడానికి ముగ్గురు పేర్లను ఎంపికలోకి తీసుకుందని.. అయితే చివర్లో ముగ్గురిలో ఎవరికి ఒకరికి అవకాశం లభిస్తుందని తెలుస్తోంది.