Pawan Kalyan New Movie: ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, రెండు కూడా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఖాతాలోనే ఉన్నాయి. జులై నెలలో ‘హరి హర వీరమల్లు’ సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్న ఆయన, కేవలం రెండు నెలల వ్యవధిలోనే ‘ఓజీ’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 316 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ రెండు చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న మరో చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ కళ్యాణ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలమే అయ్యింది. ఇప్పుడు కేవలం ఇతర నటీనటులపై మాత్రమే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెలతో ఆ షూటింగ్ కూడా పూర్తి అవ్వబోతుందని సమాచారం.
ఏప్రిల్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు?,ఓజీ చిత్రం తో అప్డేట్ అయిన పవన్ కళ్యాణ్, అలాంటి తరహా సినిమాలనే చేస్తూ ముందుకు వెళ్తాడా?, లేదంటే కమర్షియల్ సినిమాలు చేస్తాడా అని లెక్కలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ నాలుగు సినిమాలు ఒప్పుకున్నాడు. వాటిల్లో దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా, KVN ప్రొడక్షన్స్ లో ఒక సినిమా, ఓజీ 2, ఓజీ 3 కూడా ఉన్నాయి. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కబోయే సినిమాకు ‘అర్జున’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇది కచ్చితంగా పవన్ సినిమా కోసమా అనేది తెలియదు కానీ, రీసెంట్ గానే ఫిలిం ఛాంబర్ లో దిల్ రాజు ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు అట.
ఇది కచ్చితంగా పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా కోసం రిజిస్టర్ చేయించిన టైటిల్ అంటూ విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. గతం లో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘అర్జున్’ అనే టైటిల్ తో సినిమా చేసాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు దాదాపుగా అలాంటి టైటిల్ తోనే పవన్ కళ్యాణ్ సినిమా రాబోతుంది అంటూ వార్తలు రావడం గమనార్హం. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అది ఎంత వరకు నిజమో రాబోయే రోజుల్లో చూడాలి.