India vs Pakistan : వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా భారీ విజయాన్ని సాధించడం జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కి వచ్చిన పాకిస్తాన్ టీం నిర్ణీత 50 ఓవర్లకి 191 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఇక మన బౌలర్ లలో మహమ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా , కుల్దిప్ యాదవ్ లు అందరూ కలిసి సమిస్టి గా బౌలింగ్ చేసి తల రెండు వికెట్లు తీయడంతో పాకిస్థాన్ టీమ్ 42 వ ఓవర్ ఐదోవ బాల్ కి ఆల్ అవుట్ అయింది. మొత్తానికి మన బౌలర్లు అందరూ కలిసి పాకిస్తాన్ టీం ని కోలుకోలేని దెబ్బ కొట్టారు. దాంతో 200 పరుగులు కూడా చేయకుండా ఆలౌట్ అయిపోయింది.ఇక ఈ మ్యాచ్ తో ఇండియన్ బౌలర్లు వరుసగా మూడు మ్యాచ్ లో ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్,పాకిస్థాన్ టీమ్ లను 200 పరుగుల లోపే కట్టడి చేసి ఇండియన్ బౌలర్ల యొక్క స్టామినా ఏంటో ప్రపంచ దేశాలకు సైతం తెలిసేలా మరోసారి ప్రూవ్ చేశారు…ఇక పాకిస్థాన్ బ్యాట్స్ మెన్స్ లలో ఇమాముల్ హక్ , బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్ లను మినహాయిస్తే మిగిలిన బ్యాట్స్ మెన్స్ ఎవరూ కూడా అంత పెద్దగా రాణించలేదు. దాంతో ఇండియన్ బౌలర్లను ఎదుర్కోలేక పాకిస్థాన్ మిడిలాడర్ మొత్తం కూడా 191 పరుగులకే ఆలౌట్ అవ్వాల్సి వచ్చింది.
ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియన్ టీం ఓపెనర్లు అయిన శుభ్ మన్ గిల్ ,రోహిత్ శర్మ ఇద్దరు కూడా ఇండియన్ టీమ్ కి మొదట్లో మంచి ఓపెనింగ్ ని అందించారు. ఇక శుభ్ మన్ గిల్ 16 పరుగులు చేసిన తరువాత ఔట్ అవ్వగా…రోహిత్ శర్మ మాత్రం మొన్న ఆఫ్గనిస్తాన్ టీమ్ మీద ఎలా అయితే విరుచుకు పడి ఆడడో ఈ మ్యాచ్ లో కూడా చాలా దూకుడుగా ఆడుతూ ఇండియన్ టీమ్ పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించడం లో చాలా వరకు హెల్ప్ అయ్యాడు.అయితే కోహ్లీ కూడా కొద్దిసేపు బాగా ఆడినప్పటికి ఆయన కొట్టిన షాట్ సరిగ్గా కనెక్ట్ అవ్వక 16 పరుగులు చేసిన కోహ్లీ హాసన్ అలి బౌలింగ్ లో మహమ్మద్ నవాజ్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయిపోయాడు…ఇక రోహిత్ శర్మ శ్రేయాస్ ఇద్దరు కూడా చాలా బాగా ఆడుతూ వచ్చారు ఇక 63 బంతుల్లో 6 ఫోర్లు,6 సిక్స్ లతో 86 పరుగులు చేసిన రోహిత్ శర్మ షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో ఇఫ్తికర్ అహ్మద్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయిపోయాడు… ఇక దాంతో రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడు అనుకున్న అభిమానులకి నిరాశే మిగిలింది సెంచరీ చేయకుండానే ఆయన వెనుదిరిగాడు…
సెంచరీ చేయకపోయినా కూడా రోహిత్ శర్మ గ్రౌండ్ లో ఒక చిరుత పులి వేటకి వెళ్లినట్టు గా పాకిస్థాన్ బౌలర్లను వేటడు తు అందరి బాపులింగ్ లో చుక్కలు చూపించాడు… ఇక ఈ మ్యాచ్ లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ చాలా వరకు ఇండియన్ టీమ్ పవర్ ఏంటో చూపిస్తూనే అలాగే తను కెప్టెన్ గా ఎలాంటి బాధ్యతని నిర్వహిస్తున్నాడో మరోసారి ప్రపంచానికి తెలియజేశాడు.
ఇక ఈ విజయం తో ఇండియా వరల్డ్ కప్ లో వరుసగా మూడు విజయాలను అందుకుంది. దాంతో ఇండియన్ టీమ్ అభిమానులందరూ కూడా పాకిస్థాన్ మీద ఇండియా గెలుపును సెలబ్రేట్ చేసుకుంటున్నారు…నిజానికి రోహిత్ శర్మ వరల్డ్ కప్ లో తనదైన ఒక సూపర్ నాక్ ఆడుతూనే రోహిత్ శర్మ కెప్టెన్సీ లో కూడా కీలకమైన సమయానికి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఇండియన్ టీమ్ కి అద్భుతమైన విజయాలను అందిస్తున్నాడు…మూడు వికెట్లు కోల్పోయిన ఇండియన్ టీమ్ కి 30 ఓవర్ 3 బాల్స్ కి ఇండియా తన టార్గెట్ నీ రీచ్ అయింది..ఇక చివర్లో నిదానంగా ఆడుతూ కే ఎల్ రాహుల్ శ్రేయాస్ అయ్యర్ మ్యాచ్ ని విజయ తీరాలకు చేర్చారు…..శ్రేయాస్ అయ్యర్ 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా రాహుల్ కూడా 18 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు…..