India vs Pakistan : పహాల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ తో క్రికెట్ ఆడటాన్ని సగటు భారతీయుడు తప్పు పట్టాడు. క్రికెట్ అభిమానులయితే భారత జట్టు మేనేజ్మెంట్ మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రక్తం, నెత్తురు కలసి ప్రవహించలేవు అని చెప్పినవారు.. ఇప్పుడు ఎందుకు క్రికెట్ ఆడుతున్నారంటూ విమర్శించారు. సోషల్ మీడియాలో ఒక ఉద్యమాన్ని కూడా నడిపారు. మైదానంలో కాదు, చివరికి టీవీలో కూడా మ్యాచ్ చూడకూడదని తీర్మానించుకున్నారు. అయితే టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ ఆడటం లేదని.. కేవలం న్యూట్రల్ వేదిక మీద మాత్రమే సిరీస్ ఆడుతోందని.. అది కూడా ఐసీసీ నిర్వహిస్తున్న మెగా టోర్నీ అని.. ఇందులో వివాదానికి తావు లేదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి, బిసిసిఐ క్లారిటీ ఇచ్చాయి. అయినప్పటికీ వ్యతిరేక ఉద్యమం ఆగలేదు.
మైదానంలోకి ప్రేక్షకులు భారీగానే వచ్చారు. టీవీలలో కూడా మ్యాచ్ ను భారీగానే వీక్షించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు ముందు బ్యాటింగ్ ఎంచుకుంది.. భారత బౌలర్లు పిచ్ మీద డ్యూ ను సద్వినియోగం చేసుకొని అద్భుతంగా బౌలింగ్ వేశారు. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ జట్టును 127 పరుగులకు పరిమితం చేశారు. కులదీప్ మూడు, అక్షర్, బుమ్రా చెరి రెండు వికెట్లు దక్కించుకున్నారు. పాకిస్తాన్ జట్టులో ఫర్హాన్ 40, అఫ్రీది 33 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో అఫ్రిది 16 బంతుల్లో నాలుగు సిక్సర్లు కొట్టి 33 పగులు చేయడంతో పాకిస్తాన్ ఆమాత్రమైన స్కోర్ చేయగలిగింది.
అనంతరం 128 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన టీమిండియా ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. తొలి ఓవర్ నుంచి పాకిస్తాన్ మీద ఎదురుదాడికి దిగడం మొదలు పెట్టింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (31) దుమ్మురేపాడు. మరో ఓపెనర్ గిల్(10) నిరాశపరచాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (47*), తిలక్ వర్మ (31), శివం దుబే(10*) సత్తా చూపించడంతో భారత జట్టు 15.5 ఓవర్లలో మూడు వికెట్ల కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. ఈ విజయం ద్వారా టీమిండియా టాప్ 4 లోకి చేరుకుంది.. అయితే ఈ ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టుకు మరో షాకిచ్చింది టీం ఇండియా. టాస్ వేసే ప్రక్రియలో పాకిస్తాన్ కెప్టెన్ గెలిచినప్పటికీ.. అతడికి టీమ్ ఇండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మ్యాచ్ గెలిచిన తర్వాత భారత ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదు. క్రికెట్ నిబంధనల ప్రకారం మ్యాచ్ గెలిచిన తర్వాత ఓడిన, గెలిచిన జట్లు కరచాలనం చేసుకొంటాయి. గెలిచిన జట్టును ఓడిన జట్టు అభినందిస్తుంది. కానీ ఆదివారం నాటి మ్యాచ్లో ఇది ఏదీ చోటు చేసుకోలేదు. దీనిని బట్టి పహల్గాం దాడికి సరైన రివెంజ్ తీర్చుకున్నట్టు అయిందని భారత అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
"India wins, but no handshake with Pakistan. This isn’t just cricket, it’s a message for Pahalgam. "#INDvsPAK | Surya kumar Yadav | Abhishek Sharma | Tilak verma | Kuldeep Yadav | pic.twitter.com/cDDfK9P9aQ
— Harsh Vardhan (@harshvard100710) September 14, 2025