India vs Pakistan : వేదిక మారింది. ఐసీసీ నిర్వహించే టోర్నీ మారింది. ఫలితం మాత్రం అదే తీరు.. ఆట తీరు మారలేదు. ఆ నిర్లక్ష్యం మారలేదు. ఆటగాళ్లలో దూకుడు కనిపించలేదు. కనీసం నిలబడాలి.. కలపడాలి అనే సోయి దర్శనమివ్వలేదు. హోరాహోరిగా సాగుతుంది అనుకుంటున్న సందర్భంగా ఏకపక్షం… ఇదిగో ఇలా సాగిపోయింది ఆసియా కప్ లో టీమిండియా, పాకిస్తాన్ పోరు.
టాస్ గెలిచిన పాకిస్తాన్ పిచ్ పరిస్థితిని ఏమాత్రం అంచనా వేయకుండానే బ్యాటింగ్ ఎంచుకుంది. వచ్చిన అవకాశాన్ని భారత బౌలర్లు అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు.. పాకిస్తాన్ ఇన్నింగ్స్ తొలి బంతికే హార్దిక్ పాండ్యా ఓపెనర్ ఆ యుబ్ ను వెనక్కి పంపించాడు. పాండ్యా వేసిన అద్భుతమైన బంతిని షాట్ కొట్టిన ఆయుబ్.. బుమ్రా చేతికి చిక్కాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది. ఆ తర్వాత జట్టు స్కోర్ ఆరు పరుగుల వద్ద ఉన్నప్పుడు రెండో వికెట్ పడిపోయింది. ఇక అప్పటినుంచి పాకిస్తాన్ క్రమ తప్పకుండా వికెట్లను కోల్పోతూనే ఉంది. పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ పర్హాన్(40), షాహిన్ ఆఫ్రిది (33) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు.. ముఖ్యంగా చైనా మన్ కులదీప్ యాదవ్ అద్భుతమైన బంతులు వేస్తూ పాకిస్తాన్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. నాలుగు ఓవర్లు వేసిన అతడు 18 పరుగులు ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ కూడా నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. బుమ్రా రెండు వికెట్లు దక్కించుకున్నాడు.. చివర్లో షాహిన్ అఫ్రిది 33 పరుగులు చేయడంతో పాకిస్తాన్ 127 రన్స్ స్కోర్ అయినా చేయగలిగింది.
వాస్తవానికి ఈ మ్యాచ్ నిర్వహణపై టీమిండియా అభిమానులు అంతగా ఆసక్తిగా లేరు. ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ అంటే సగటు భారతీయ క్రికెట్ అభిమాని మండిపడుతున్నాడు. అసలు ఆదేశంతో క్రికెట్ ఆడాల్సిన అవసరం ఏంటని సోషల్ మీడియాలో నా ఆదివారం నుంచి విపరీతంగా ప్రచారం మొదలైంది. ఒకానొక దశలో ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు కూడా అంతగా అమ్ముడుపోలేదు. దీంతో మ్యాచ్ పై అంతగా ఆసక్తి ఉండదని అంచనాలు వినిపించాయి. అయితే భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేయడంతో కాస్తలో కాస్త ఈ మ్యాచ్ పై ఆసక్తి కలిగింది. లేనిపక్షంలో మరింత దారుణంగా ఉండేది. ఏది ఏమైనప్పటికీ భారత బౌలర్లు మరోసారి దుమ్మురేపారు. ఇటీవల తొలి మ్యాచ్ లో వేసినట్టుగానే బౌలింగ్ వేశారు. ముఖ్యంగా అక్షర్, కులదీప్ ను ఎదుర్కోవడానికి పాకిస్తాన్ బ్యాటర్లు తీవ్రంగా శ్రమించారు. పాకిస్తాన్ జట్టులో ఐదుగురు ఆటగాళ్లు సింగల్ డిజిట్ కు పరిమితమయ్యారు అంటే భారత బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
– 3 wickets by Kuldeep.
– 2 wickets by Bumrah.
– 2 wickets by Axar.
– 1 wickets by Hardik.
– 1 wicket by Varun.A complete bowling performance by India. pic.twitter.com/RH09DjALCy
— Johns. (@CricCrazyJohns) September 14, 2025