OG Promotional Video పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి… ఇక ఈనెల 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులందరు ఈ సినిమా కోసం చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే పవర్ స్టార్ ను ఏ రేంజ్ లో అయితే అభిమానులు చూడాలనుకుంటున్నారో అంతకు మించిన రేంజ్ లో చూపించడానికి సుజీత్ సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇంకా చేపట్టడం లేదేంటి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కొంతవరకు టెన్షన్ లో ఉన్నారు. ఇక వీటన్నింటికీ తెర దించుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రమోషనల్ వీడియో నైతే చేశారు.
అయితే ఆ వీడియో మరో రెండు రోజుల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సుజీత్ తమన్ ముగ్గురు కలిసి దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి ఈ ప్రమోషనల్ వీడియో చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట.
ఈ వీడియోని సుజిత్ రెడీ చేయించినట్టుగా తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ సైతం ఈమధ్య ప్రమోషన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… వీరమల్లు సినిమా సమయంలో కూడా ప్రమోషన్స్ కోసం కొంత సమయాన్ని కేటాయించాడు. ఇక ఓజి సినిమా మీద మంచి హైపు ఉంది. కాబట్టి దీనికి చిన్న పుష్ ఇస్తే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ ఈ ప్రమోషనల్ వీడియోలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది…
ఇక తమన్, సుజిత్ కలిసి ఈ ప్రమోషనల్ వీడియోని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట. పాటల రూపంలో ప్రమోషనల్ సాంగ్ ను చేశారా? లేదంటే డైలాగ్స్ రూపంలో చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారా? అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది…ఇక ప్రస్తుతం ఈ సినిమా కోసం ఇండియన్ ప్రేక్షకులందరు వెయిట్ చేస్తుండటం విశేషం…