India Vs Oman Asia Cup 2025: ఆసియా కప్ లో టీం ఇండియా ఎదురనేది లేకుండా దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు విజయాలతో సూపర్ 4 లోకి ప్రవేశించింది. శుక్రవారం లీగ్ దశలో తన చివరి మ్యాచ్ ఆడబోతోంది. ఓమన్ జట్టుతో తలపడబోతోంది. ఇందులో భారత విజయం లాంచనమే అయినప్పటికీ.. ఈ మ్యాచ్లో ప్రయోగాలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: ముంబై వేస్ట్.. బెంగళూరు బెస్ట్.. బాలీవుడ్ విలక్షణ డైరెక్టర్ తెలుసుకున్న నీతి ఇదీ…
ఇటీవల టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెళ్లినప్పుడు కొన్ని మ్యాచ్లలో బుమ్రా కు విశ్రాంతి ఇచ్చారు. దీనిపై రకరకాల ఫిర్యాదులు వచ్చినప్పటికీ అతనిపై వర్క్ లోడ్ తగ్గించడానికి ఈ విధానం అందుబాటులోకి తెచ్చామని టీమిండియా కోచ్ గంభీర్ వెల్లడించాడు. ఇప్పుడు ఓమన్ జట్టుతో జరిగే మ్యాచ్లో కూడా బుమ్రా కు విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది. అతడి స్థానంలో అర్ష్ దీప్ సింగ్ కు అవకాశం ఇస్తారని తెలుస్తోంది.. హార్దిక్ పాండ్యాకు కూడా విశ్రాంతి ఇచ్చి అతని స్థానంలో హర్షిత్ రాణా కు అవకాశం ఇస్తారని సమాచారం. జితేష్ శర్మ, రింకు సింగ్ కు కూడా అవకాశం ఇస్తారని సమాచారం.
లీగ్ దశ తర్వాత టీమిండియా సూపర్ 4 లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లేదా బంగ్లాదేశ్, శ్రీలంక జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఈ మూడు జట్లు పసి కూనలు కావు కాబట్టి.. టీమిండియా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. అందువల్లే జట్టులో కొంతమంది ఆటగాళ్లకు ఓమన్ తో జరిగే మ్యాచ్ కు దూరం పెట్టి.. తదుపరి మ్యాచ్ లకు అవకాశం ఇస్తారని సమాచారం. దీనివల్ల వారి మీద పని భారం తగ్గిస్తారని తెలుస్తోంది. ఓమన్ జట్టుతో జరిగే మ్యాచ్ లో సంజు శాంసన్ ను ఓపెనర్ గా పంపిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది.