IND Vs NZ: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీం ఇండియా ముందుగా బౌలింగ్ చేయాల్సి వచ్చింది.. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ కి చెరో వికెట్ దక్కింది.
Also Read: రోహిత్ శర్మకు ఇదేం దురదృష్టం.. 12వ సారి కూడా విఫలం.. ఇలా అయితే ఎలా?
న్యూజిలాండ్ ఓపెనర్లు రచిన్ రవీంద్ర (37), యంగ్(15) తొలి వికెట్ కు 57 పరుగులు జోడించాడు. ఈ జోడిని వరుణ్ చక్రవర్తి విడదీశాడు.. ఆ తర్వాత రచిన్ రవీంద్ర, విలియంసన్(11), ప్రమాదకరమైన లాతం (14) త్వరగానే అవుట్ అయ్యారు. టీమిండియా స్పిన్ బౌలర్లు ఆధిపత్యం చూపిస్తున్న నేపథ్యంలో ఫిలిప్స్(34), మిచెల్(63) సమయోచితంగా ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 57 పరుగులు జోడించారు. అయితే ఈ జోడిని వరుణ్ చక్రవర్తి విడదీశాడు. 34 పరుగులు చేసిన ఫిలిప్స్ ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్రేస్ వెల్ (53*) పరుగులు చేశాడు. మిచెల్, బ్రేస్ వెల్ ఆరో వికెట్ కు 46 పరుగులు జోడించారు.. ఆ తర్వాత మిచెల్ షమీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ 8 పరుగులు చేసి విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్ కు రన్ అవుట్ అయ్యాడు.
అదర కొట్టిన భారత బౌలర్లు
స్పిన్ బౌలింగ్ సహకరిస్తున్న ఈ మైదానంపై భారత బౌలర్లు అదరగొట్టారు. స్పిన్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా సత్తా చాటారు. వీరందరి ఎకానమీ 4.5 దాటకపోవడం విశేషం.పేస్ బౌలర్లలో మహమ్మద్ షమీ మాత్రమే ఒక వికెట్ దక్కించుకున్నాడు మిగతా ఐదు వికెట్లు మొత్తం స్పిన్ బౌలర్లు తీయడం విశేషం. అక్షర్ పటేల్ వికెట్లు పడగొట్టకపోయినప్పటికీ.. కట్టదిట్టమైన బంతులు వేశాడు. అతని బౌలింగ్లో బ్యాటింగ్ చేయడానికి న్యూజిలాండ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత్ 252 పరుగులు చేస్తే విజేతగా నిలుస్తుంది. అయితే ఈ మైదానంపై చేజింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుందని క్యూరేటర్ చెబుతున్నారు. అయితే ఇదే మైదానంపై లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ముందుగా బౌలింగ్ చేసింది. భారత్ విధించిన తక్కువ స్కోరును చేదించలేక ఓటమిపాలైంది. అయితే ఆ మ్యాచ్ ఫలితాన్ని చూసి న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకొని ఉంటాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. న్యూజిలాండ్ జట్టుతో పోల్చి చూస్తే భారత బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. చేజింగ్ లో భారత జట్టు పరాక్రమాన్ని ప్రదర్శిస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రోహిత్, విరాట్ సమర్థవంతంగా ఆడితే ఫలితం టీమ్ ఇండియాకు అనుకూలంగా ఉంటుందని వారు చెబుతున్నారు.