New Zealand Vs India: లెక్క తప్పలేదు. అంచనా మారలేదు. మొత్తానికి టీం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించింది. హోరాహోరిగా సాగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2013 లో ధోని ఆధ్వర్యంలో ఛాంపియన్ స్ట్రోఫీని అందుకున్న టీమిండి.. దాదాపు 12 సంవత్సరాల తర్వాత చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. మిచెల్ 63, బ్రేస్ వెల్ 53* పరుగులతో ఆకట్టుకున్నారు. వరుణ్ చక్రవర్తి, కుల దీప్ యాదవ్ చేరి రెండు వికెట్లు దక్కించుకున్నారు. 252 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన టీమిండియా మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ రీచ్ అయింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆటగాళ్లు సమయోచితంగా ఆడటంతో భారత్ విజయం సాధించింది. రోహిత్ శర్మ (76), శ్రేయస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ (34) అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. బ్రేస్ వెల్, శాంట్నర్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
