India vs New zealand: చావోరేవో తేల్చుకోనున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్

India vs New zealand: ఆ పాకిస్తాన్ టీం వాళ్లు పగతో రగిలిపోయి టీమిండియాను చిత్తుచిత్తుగా ఓడించేశారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా ఇలా చతికిల పడుతుందని అభిమానులు అస్సలు ఊహించలేదు. మొదటి మ్యాచ్ లోనే ఓడిపోయిన టీమిండియాకు ఈరోజు రాత్రి జరుగబోయే మ్యాచ్ చావోరేవో.. ఇటు టీమిండియాకు, అటు న్యూజిలాండ్ కు ఈ మ్యాచ్ ఓడితే ఇంటికే.. ఎందుకంటే ఇదే పాకిస్తాన్ చేతిలో టీమిండియా, న్యూజిలాండ్ రెండు జట్లు ఓడిపోయాయి. సో సెమీస్ చేరాలంటే […]

Written By: NARESH, Updated On : October 31, 2021 10:00 am
Follow us on

India vs New zealand: ఆ పాకిస్తాన్ టీం వాళ్లు పగతో రగిలిపోయి టీమిండియాను చిత్తుచిత్తుగా ఓడించేశారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా ఇలా చతికిల పడుతుందని అభిమానులు అస్సలు ఊహించలేదు. మొదటి మ్యాచ్ లోనే ఓడిపోయిన టీమిండియాకు ఈరోజు రాత్రి జరుగబోయే మ్యాచ్ చావోరేవో.. ఇటు టీమిండియాకు, అటు న్యూజిలాండ్ కు ఈ మ్యాచ్ ఓడితే ఇంటికే..

india vs new zealand

ఎందుకంటే ఇదే పాకిస్తాన్ చేతిలో టీమిండియా, న్యూజిలాండ్ రెండు జట్లు ఓడిపోయాయి. సో సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాలి. అందే ఇప్పుడు రెండు జట్లకు ముందున్న పెనుసవాల్. ఓడిపోయారా? ఇక ఇంటికే.. ఆల్ రెడీ మూడు వరుస విజయాలతో పాకిస్తాన్ సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. ఇప్పుడు రెండో బెర్త్ కోసం ఇండియా, న్యూజిలాండ్, అప్ఘనిస్తాన్ పోటీపడుతున్నాయి. ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.

ప్రపంచకప్ ఫేవరేట్ టీంలో ఒకటిగా బరిలోకి దిగిన టీమిండియా కథ ముగియడానికి ఈ రాత్రి మ్యాచ్ కీలకం. ఓడితే టీమిండియా ప్రపంచకప్ ఆశలు ముగిసినట్టే. నాకౌట్ లాంటి ఈ మ్యాచ్ లో కోహ్లీసేన ఎలా కొరకరాని కొయ్య లాంటి న్యూజిలాండ్ ను ఓడిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.

భారీ స్టార్లతో కూడిన భారత బ్యాటింగ్, బౌలింగ్ దళానికి నిజంగానే ఇది కఠిన పరీక్ష. ప్రతీసారి అన్నింటిపై గెలిచి కివీస్ పైనే ఓడిపోయే టీమిండియా ఈరోజు గెలవాలంటే అద్భుతం చేయాల్సిందే.

ఇండియా, కివీస్ లకు తదుపరి మ్యాచ్ లలో అప్ఘనిస్తాన్, స్కాంట్లాండ్, నమీబియా ఉన్నాయి. ఈ మూడింటిపై ఈజీగా గెలుస్తారు. కానీ ఇండియా, కివీస్ ల మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వాళ్లదే సెమీస్ రేసు. ఓడిన జట్టు ఇంటిముఖం పట్టినట్టే.

న్యూజిలాండ్ టీం అంత ఈజీగా వదిలిపెట్టే రకం కాదు. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లలో సత్తా చాటుతుంది. వారు పట్టుదలగా ఆడుతారు.

ఇక టీమిండియాలో రెండు మార్పులు ఉండొచ్చు. ఇషాన్ కిషన్ ను తీసుకునే చాన్స్ ఉంది. ఇక బౌలర్ గా శార్ధుల్ ఠాకూర్ ను భువనేశ్వర్ స్థానంలో తీసుకునే అవకాశం ఉంది. పాక్ తో మ్యాచ్ లో ఓటమితో ఫాంలో లేని హార్ధిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడు బ్యాటింగ్ చేయలేదు. అలాగే గాయంతో బౌలింగ్ కు దిగలేదు. దీంతో ఇషాన్ కిషన్ ను తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. లేదంటే శార్ధుల్ ఠాకూర్ ను లేదా అశ్విన్ ను తీసుకోవచ్చు. కివీస్ తో మ్యాచ్ లో హార్ధిక్ పై వేటు పడుతుందా? లేక హార్ధిక్ కు మరో అవకాశం ఇస్తారా? అన్నది వేచిచూడాలి.

దుబాయ్ వేదికగా రాత్రి 7.30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ లో టాస్ కీలకం అని చెప్పొచ్చు. టాస్ నెగ్గితే ఫీల్డింగ్ తీసుకుంటే ఆ జట్టు గెలిచినట్టే. ప్రతీ మ్యాచ్ లో టాస్ ఓడిపోతున్న విరాట్ కోహ్లీకి టాస్ భయపెడుతోంది. పాకిస్తాన్ తో మ్యాచ్ లో టాస్ ఓడి భారత్ ఓడిపోయింది. నిన్న ఇదే వేదికపై టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ తీసుకొని ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. దీంతో టాస్ గెలిచిన జట్టు మ్యాచ్ గెలిచినట్టే. ఏం జరుగుతుందనేది రాత్రి తేలనుంది.