India Vs Nepal Asian Games 2023: చైనా నిర్వహిస్తున్న ఏషియన్ గేమ్స్ లో భాగం ఇండియా నేపాల్ టీం ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది.చైనా లోని హాంగ్ జౌ వేదిక జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది.ఈ మ్యాచ్ లో మన ఇండియన్ ప్లేయర్లు అద్భుతం గా ఆడి నేపాల్ మీద ఒక అద్భుతమైన విక్టరీ కొట్టారు.కుర్ర ప్లేయర్లు అయిన చాలా బాగా ఆడి ఇండియా టీం కి అదిరిపోయే గెలుపు ని సాధించి పెట్టారు.ఇక ఒకసారి మ్యాచ్ ని కనక గమనిస్తే ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం ఓపెనర్లు అయిన యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కూడా టీం కి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు.ఇద్దరు కలిసి మొదటి వికెట్ కి 103 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం అనే చెప్పాలి.
మొదటి నుంచి గైక్వాడ్ నిదానం గా ఆడుతూ వస్తే జైశ్వాల్ మాత్రం మంచి దూకుడు మీద ఆడుతూ వచ్చాడు.ఇక 23 బంతుల్లో 25 పరుగులు చేసిన గైక్వాడ్ దీపేంద్ర సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు…ఇక ఈయన తర్వాత భారీ అంచనాలతో వచ్చిన తిలక్ వర్మ 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.వర్మ తర్వాత వచ్చిన జితేష్ శర్మ కూడా 5 పరుగులకే వెనుతిరిగారు.ఇక పీకలోత్తు కష్టాల్లో పడ్డ ఇండియన్ టీం ని జైశ్వాల్ చాలా బాగా ఆదుకున్నాడు ఆయన అవసరం అయిన సమయం లో స్లో గా ఆడుతూనే మరో పక్క హిట్టింగ్ కూడా చేశాడు…ఇక మొత్తం జైశ్వాల్ 49 బంతులు ఆడితే అందులో 7 సిక్స్ లు, 8 ఫోర్లు కొట్టి 100 పరుగులు చేశాడు.ఇక సెంచరీ పూర్తి చేసుకున్న జైశ్వాల్ దీపేంద్ర సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.ఇక చివర్లో రింకు సింగ్ వచ్చి 15 బంతుల్లో 4 సిక్స్ లు 2 ఫోర్లు కొట్టి 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక మరొక ఎండ్ లో ఆడిన శివమ్ దూబే కూడా 19 బంతుల్లో 1 సిక్స్ 2 ఫోర్లు కొట్టి 25 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దాంతో ఇండియా టీం నిర్ణీత 20 ఓవర్లకి 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది…
ఇక భారీ స్కోర్ ని ఛేదించడానికి బరిలోకి దిగిన నేపాల్ టీం కి మొదట్లోనే భారీ దెబ్బ తగిలింది.10 రన్స్ చేసిన అసిఫ్ షైక్ ని అవేశ్ ఖాన్ అవుట్ చేసి ఇండియన్ టీం కి ఒక మంచి వికెట్ ని అందించాడు.ఇక నేపాల్ బ్యాట్స్ మెన్స్ లలో ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. మొన్న మంగోలియా మీద జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించిన కుషాల్ మల్లా సైతం 29 పరుగులు చేసి అవుట్ అయి పోయాడు. అలాగే మొన్నటి మ్యాచ్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన దీపేంద్ర సింగ్ కూడా ఈ మ్యాచ్ లో 15 బంతుల్లో 4 సిక్స్ లు కొట్టి 32 పరుగులు చేసి వాళ్ళకి మ్యాచ్ మీద కొంచం ఊపు తీసుకువచ్చినప్పటికీ ఆయన చివరి వరకు నిలబడలేకపోయారు.రవి బిష్ణోయ్ తన స్పిన్ మాయాజాలం తో అతన్ని బోల్తా కొట్టించాడు…ఇక నేపాల్ టీం ఇండియన్ బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లకి 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసింది. ఇక దాంతో ఇండియా 23 రన్స్ తో నేపాల్ పైన ఘన విజయాన్ని అందుకుంది.
ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం లోని బౌలర్లు కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు…అందులో అర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీయగా, అవేశ్ ఖాన్ 3 వికెట్లు, రవి బిష్ణోయ్ 3 వికెట్లు, సాయి కిషోర్ ఒక వికెట్ తీశారు…ఇలా ఇండియన్ బౌలర్లు అందరు కూడా సూపర్ గా బౌలింగ్ చేయడం అనేది ఇండియన్ టీం కి చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి…ఇక ఈ మ్యాచ్ లో గెలిచి ఇండియా టీం సెమి ఫైనల్ లోకి అడుగు పెట్టింది…ఇక ఇప్పటికే ఇండియన్ ఉమెన్స్ టీం గోల్డ్ మెడల్ సాధించి అదరగొట్టగా, ఇప్పుడు మెన్స్ టీం కూడా గోల్డ్ మెడల్ కోసం పోరాడుతుంది.ఇక ఏది ఏమైనా కూడా ఈ మ్యాచ్ జైశ్వాల్ ఒక అద్భుత సెంచరీ చేయడం అనేది మన ఇండియన్ టీం కి చాలా గర్వ కారణం అనే చెప్పాలి. ఇక ఏషియన్ కప్ లో ఆడుతున్న మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన ప్లేయర్ గా జైశ్వాల్ రికార్డు క్రియేట్ చేశాడు…కుర్ర ప్లేయర్లు అయిన కూడా మన ఇండియన్ క్రికెట్ టీం పవర్ ఏంటో చైనా వేదిక గా ప్రపంచానికి తెలియజేసారు…
https://www.youtube.com/watch?v=dUWmWBi_BP4