India Vs England Warm Up Match: ఇంకొక వారం రోజులు అయితే వరల్డ్ కప్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అన్ని జట్లు కూడా వార్మప్ మ్యాచ్ లు ఆడడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక ఈ రోజు మన ఇండియా టీమ్ ఇంగ్లాండ్ తో వార్మప్ మ్యాచ్ ఆడబోతుంది. అయితే ఈ వార్మప్ మ్యాచ్ ని ఇండియా టీం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం… ముందుగా ఉన్న డౌట్లు ఏంటంటే ఈ వార్మప్ మ్యాచ్ లో ఆడినప్పుడు మన ప్లేయర్లు చేసే రన్స్ గానీ, తీసే వికెట్లు గాని వాళ్ల ఇంటర్ నేషనల్ కెరియర్ కి ఆడ్ అవుతాయా లేదా అనేది చాలామందిలో తలెత్తే క్వశ్చన్ అయితే వార్మప్ మ్యాచ్ ఆడినప్పుడు మన ప్లేయర్లు చేసిన రన్స్ అనేవి ఇంటర్నేషనల్ కెరియర్ కి ఆడ్ అవవు, అవీ ఓన్లీ డొమెస్టిక్ మ్యాచ్ లకి మాత్రమే ఆడ్ అవుతాయి.
ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్తే ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈరోజు గౌహతి వేదికగా ఒక భారీ వార్మప్ మ్యాచ్ అయితే జరుగుతుంది. గౌహతి లోని బరస్పర పిచ్ లో ఈ మ్యాచ్ ఆడబోతున్నారు పిచ్ ఎక్కువ బ్యాటింగ్ ఫ్రెండ్లీ గా ఉంటుంది.అలాగే ఈ పిచ్ లో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ఆడితే అందులో నాలుగు ఇన్నింగ్స్ లలో కూడా ఆ టీమ్ లు 300కు పైన పరుగులు చేశాయి…అయితే ఈ పిచ్ లో బ్యాట్స్ మెన్స్ భారీ పరుగులు చేసే అవకాశం అయితే ఉంది.ఇక బౌలర్లు కొంచెం జాగ్రత్తగా బౌలింగ్ వేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఒకసారి ఇండియన్ ప్లేయర్లు ఎవరైతే ఈ మ్యాచ్ లో ఆడబోతున్నారో వాళ్ళ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం… ముందుగా ఈ మ్యాచ్ లో వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా మీద మనం ఆడబోతున్న మ్యాచ్ లో ఎవరైతే టీం లో ఉంటారో వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది.అయితే మొదట 6 మంది ప్లేయర్లలో ఒక లెఫ్ట్ హ్యాండర్ అయిన ఉండాలి అంటే ఇషాన్ కిషన్ టీమ్ లో ఉంటాడు. అయితే ఇషాన్ కిషన్ టీం లోకి వస్తె ఎవరిని బయటకి పంపిస్తారు అనేది తెలియాలి.ఒకవేళ అతన్ని తీసేసి వేరే ప్లేయర్ని పెడతారా అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది.
అయితే మొదటి మూడు ప్లేస్ లలో రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు ఉన్నారు. ఇక నెంబర్ ఫోర్ లో శ్రేయాస్ అయ్యర్ కూడా ఆడతాడు,అలాగే నెంబర్ ఫైవ్ లో కే ఎల్ రాహుల్,నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా ఉంటారు ఈ సమయంలో ఇసాన్ కిషన్ ని తీసుకుంటే ఎవరిని పక్కన పెడతారు అనేది కూడా ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం… మ్యాచ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే టీం లో ఉన్న 15 మంది ప్లేయర్లు ఈ మ్యాచ్ లో భాగం కావచ్చు అయితే 11 మంది మాత్రమే బ్యాటింగ్ చేయాలి కానీ బౌలింగ్ విషయానికి వచ్చినప్పటికి మాత్రం ఈ 11 మంది కాకుండా వేరే ప్లేయర్లు కూడా బౌలింగ్ చేయొచ్చు…ఇక మన టీం లో ఉండే ప్లేయర్లలో కిషన్ కిషన్ ని పక్కన పెట్టే అవకాశం అయితే ఉంది.ఇక దానికి తోడుగా మన ఇండియా గత కొద్ది రోజులుగా చాలా ఇన్నింగ్స్ లో బాగా ఆడుతూ మంచి విజయాలను అందుకుంటుంది.
అయితే ఈ మ్యాచ్ లో మనవాళ్లు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే భారీ చేజ్ చేయాలి. గత కొద్ది రోజులుగా మనవాళ్లు భారీ స్కోరు చేజ్ చేసిన మ్యాచులు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఆస్ట్రేలియా మీద ఆడిన మూడో వన్డేలో భారీ స్కోర్ చేజ్ చేయాలని చూశారు, కానీ అక్కడ మన వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. దాంతో ఇప్పుడు కూడా మనవాళ్ళు భారీ రన్ చేజ్ అనేది చేయగలరా లేదా అనేది ఒకసారి పరీక్షించుకుంటే బాగుంటుంది. దానికోసం అని మనవాళ్లు ఒకవేళ టాస్ గనక గెలిస్తే మొదట బౌలింగ్ బెటర్…ఇక దానివల్ల చాలా వరకు రన్ చేంజ్ ని ఈజీగా చేయగలుగుతుంది అనేది మనకు ఈజీగా అవగాహన అవుతుంది. అలాగే ఇంగ్లాండ్ లాంటి ఒక భారీ టీం మీద మ్యాచ్ ఆడినప్పుడు మన వాళ్ళ పర్ఫామెన్స్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకు ఈజీగా అర్థమవుతుంది. మనవాళ్లు ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే మొదట బౌలింగ్ తీసుకోవడమే ఉత్తమం…