India Vs England 2nd Test: భారత్ – ఇంగ్లండ్ జట్లమధ్య విశాఖపట్నంలో జనుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ కూడా రసకందాయంలో పడుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసిన టీమిండియా ఇంగ్లండ్‌ను ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే కట్టడి చేసింది. సెకండ్ ఇన్సింగ్ ప్రారంభించిన భారత జట్టు మూడో రోజు మళ్లీ టపటపా వికెట్లు పారేసుకుంది. లంచ్ విచా మసమాయానికే భారత్ 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఫస్ట్ సెషన్స్‌లోనే నాలుగు వికెట్లు కోల్పయింది. శుభ్‌మన్ గిల్(60), అక్షర్ పటేల్(2)తో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం273 పరుగుల ఆధిక్యంలో ఉంది.
మూడో రోజు ఇలా..
మూడో రోజు 20/0 స్కోర్‌తో ఆట ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే రోహిత్‌శర్మను అండర్‌సన్ ఔట్ చేశాడు. 13 పరుగులకు కెప్టెన్ పెవిలియన్ పట్టగా మూడో స్థానంలో వచ్చిన పటీదార్ 9 పరుగుల చేసి రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ చేసిన జైశ్వాల్ ఈసారి 17 పరుగలకే వెనుదిరిగాడు. 112 పరుగుల వద్ద మూడో వికెట్ పడింది. 29 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యార్ టామ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరారు. క్రీజ్‌లో రజత్ పటిదార్ వచ్చాడు.
గిల్ హాఫ్ సెంచరీ..
వైజాగ్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్‌లో శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. ఫస్ట్ టెస్టులో వరుసగా డక్‌ఔట్ అయిన గిల్ రెండో టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనూ నిరాశ పర్చాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం నిలకడగా ఆడుతూ 52 బంతుల్లోనే హాఫ్ సెచరీ చేశాడు. 130 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
క్రీజ్‌లో గిల్, అక్షర్..
ప్రస్తుతం లంచ్ తర్వాత గిల్, అక్షర్ పటేల్ నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం గిల్ 69 పరుగులు చేయగా, అక్షర్ 10 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్‌సన్ 2 వికెట్లు, రహానే అహ్మద్, టామ్ హార్ట్‌లీ తలా ఒక వికెట్ తీశారు.