
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పుడు ఈ సిరీస్‌కు అనుకోని అవాంతరం ఏర్పడింది. ఫలితంగా ఈ సిరీస్‌లో ఇక మిగిలిన మ్యాచ్‌లన్నింటినీ క్లోజ్డ్ డోర్స్ మధ్య నిర్వహించనున్నారు. ఈ మేరకు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించడానికి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వట్లేదని తెలిపింది. గుజరాత్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. ప్రేక్షకులు కొనుగోలు చేసిన టికెట్ల మొత్తాన్ని రీ ఫండ్ చేస్తామని స్పష్టం చేసింది.
Also Read: రోహిత్ ఎంట్రీ ఇంగ్లండ్ తో ఈరోజు టఫ్ ఫైట్
దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రెండో విడత పెరుగుదల ఆరంభంలో మహారాష్ట్రకే పరిమితమైన కేసుల సంఖ్య.. క్రమంగా పొరుగునే ఉన్న గుజరాత్‌కు కూడా పాకింది. అక్కడా రోజువారీ కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. సోమవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. 24 గంటల్లో 890 కేసులు నమోదయ్యాయి. కొద్దిరోజులుగా నమోదైన కేసులతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువే. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదైన దాఖలాల్లేవు.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్, -ఇంగ్లాండ్ మధ్య కొనసాగుతున్న టీ20 సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించడానికి ప్రేక్షకులకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
Also Read: అనుకున్నట్లే ఆమెనే పెళ్లి చేసుకున్న బూమ్రా..
వాస్తవానికి – నరేంద్ర మోడీ స్టేడియం సీటింగ్ సామర్థ్యంలో 50 శాతం వరకు మాత్రమే ప్రేక్షకులకు అనుమతి ఇస్తున్నారు. లక్షా 10 వేల మంది ప్రేక్షకులు ఒకేసారి మ్యాచ్‌లను తిలకించే సామర్థ్యం ఉన్న ఈ స్టేడియంలో భారత్,-ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించడానికి 60,000 నుంచి 70,000 మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. తొలి టీ20-,67,532, రెండో టీ20,66,000 మంది ప్రేక్షకులు తిలకించారు. మిగిలిన మూడు మ్యాచ్‌ల కోసం ఇప్పటికే టికెట్లను విక్రయించింది గుజరాత్ క్రికెట్ అసోసియేషన్. అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకుల టికెట్ డబ్బులను రీఫండ్ చేస్తామని తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ధన్‌రాజ్ నత్వానీ ఓ ప్రకటన విడుదల చేశారు.