https://oktelugu.com/

india vs england 3rd test live score updates: టాస్ ఇండియాదే.. ఇంగ్లండ్ భారీ మార్పులు

మాటల మంటలు రేపుతున్న ఇండియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ లో కీలకమైన మూడో మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. రెండో టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్లు తిట్టుకోవడాలు హద్దులు దాటి డ్రెస్సింగ్ రూంలోనే వాదులాడుకున్న సంగతి తెలిసిందే. దీంతో పట్టుదలగా ఆడిన భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ ను చిత్తు చేసి విజయం సాధించారు. ముఖ్యంగా భారత బౌలర్లను ఇంగ్లండ్ ఆటగాళ్లు దూషించడం.. ప్రతిగా కసిగా ఆడి బౌలర్లే గెలిపించడంతో ఆట రక్తికట్టించింది.. మూడో టెస్టుకు హాట్ ఫేవరేట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 25, 2021 / 03:48 PM IST
    Follow us on

    మాటల మంటలు రేపుతున్న ఇండియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ లో కీలకమైన మూడో మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. రెండో టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్లు తిట్టుకోవడాలు హద్దులు దాటి డ్రెస్సింగ్ రూంలోనే వాదులాడుకున్న సంగతి తెలిసిందే. దీంతో పట్టుదలగా ఆడిన భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ ను చిత్తు చేసి విజయం సాధించారు. ముఖ్యంగా భారత బౌలర్లను ఇంగ్లండ్ ఆటగాళ్లు దూషించడం.. ప్రతిగా కసిగా ఆడి బౌలర్లే గెలిపించడంతో ఆట రక్తికట్టించింది..

    మూడో టెస్టుకు హాట్ ఫేవరేట్ గా ఇండియా బరిలోకి దిగుతోంది. ఐదుటెస్టుల సిరీస్ లో టీమిండియా ఈ టెస్ట్ గెలిస్తే సిరీస్ గెలిచినట్టే.. అందుకే పట్టుదల ప్రదర్శిస్తోంది.

    బ్యాటింగ్ కొంచెం మెరుగుపడాల్సి ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ లో సేమ్ రెండో టెస్ట్ గెలిచిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. ఈ మధ్యాహ్నం టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలి ఓవర్ లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ డక్ (0))కే ఔట్ కావడం షాకింగ్ గా మారింది.

    ఇక ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ తప్పితే మిగతా ఆటగాళ్లు రాణించని ఇంగ్లండ్ జట్టుకు రెండో టెస్ట్ ఓటమి కృంగదీసింది. రెండో టెస్ట్ విజయం అందించిన జట్టుతోనే టీమిండియా బరిలోకి దిగగా.. ఇంగ్లండ్ మాత్రం రెండు మార్పులు చేసింది. డొమినిక్ సిబ్లి స్థానంలో ప్రపంచ నంబర్ 1 టీ20 ప్లేయర్ డేవిడ్ మాలన్ ను టెస్ట్ జట్టులోకి తీసుకుంది. గాయంతో దూరమైన మార్క్ వుడ్ స్థానంలో క్రయిగ్ ఓవర్టన్ ను ఎంపిక చేసింది.

    3rd Test. India XI: R Sharma, KL Rahul, C Pujara, V Kohli, A Rahane, R Pant, R Jadeja, I Sharma, M Shami, J Bumrah, M Siraj