India vs England 3rd ODI: టీమిండియా నేడు ఇంగ్లండ్ తో జరిగే వన్డేలో చావో రేవో తేల్చుకోనుంది. మూడు వన్డేల సిరీస్ లో 1-1 స్కోరుతో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా నిలిచాయి. దీంతో ఆదివారం జరిగే మ్యాచ్ లో ఇంగ్లండ్ ను ఓడించి సిరీస్ గెలుచుకోవాలని రోహిత్ సేన ఆశిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ కూడా ఈ మ్యాచ్ లో ఇండియాను ఓడించి టీ 20 కప్ గెలుచుకున్న దానికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. మొదటి వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ విఫలమవడంతో జట్టు ఘోరమైన పరాజయం చవిచూసింది. వంద పరుగుల తేడాతో అపజయం మూటగట్టుకుంది. దీంతో దానికి కూడా బదులు తీర్చుకునే క్రమంలో రోహిత్ శర్మ రెండో వన్డేలో ఇంగ్లండ్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్నట్లు ఆలోచిస్తోంది.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుస విజయాలు అందుకున్నా రెండో వన్డేలో దారుణమైన పరాభవం ఎదురైంది. దీంతో దానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంలో రోహిత్ శర్మ వ్యూహాలు ఖరారు చేస్తున్నాడు. మాంచెస్టర్ వేదికగా ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. దీంతో ఇరు జట్లు తమ బలాబలాలు ప్రదర్శించుకోవాలని చూస్తున్నాయి. సిరీస్ గెలుచుకోవాలనే ఉద్దేశంతో కసరత్తు చేస్తున్నాయి. ఇరు జట్లు తమ తుది జట్లలో ఎలాంటి మార్పులు చేసేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
Also Read: Jagdeep Dhankhar: వెంకయ్యకు షాక్ లగా.. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ కర్?
ఒకవేళ టీమిండియా జట్టులో మార్పు చేయదలుచుకుంటే రెండో వన్డేలో విఫలమైన ప్రసీద్ కృష్ణపై వేటు వేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకైతే ఎలాంటి మార్పులు చేపట్టడం లేదు. అయితే కోహ్లి ఫామ్ లో లేకపోవడం కలవరపెడుతోంది. అతడు రాణిస్తాడని అనుకున్న ప్రతిసారి నిరాశ పరుస్తుండటం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. కోహ్లి అద్భుతమైన ఆటగాడని త్వరలో బ్యాట్ తో అందరి విమర్శలకు సమాధానం చెబుతాడని రోహిత్ శర్మ సైతం చెప్పడం విశేషం. దీంతో టీమిండియా బ్యాటింగ్ లు ఇబ్బందులు తొలగించుకుంటే విజయం ఖాయమనే తెలుస్తోంది.
బౌలింగ్ లో మాత్రం టీమిండియా అదరగొడుతోంది. రెండో వన్డేలో బౌలర్లు రాణించినా బ్యాటర్లే విఫలమయ్యారు. దీంతో ఓటమి తప్పలేదు. బుమ్రా, షమీ పేస్ బౌలింగ్ తో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ను తిప్పలు పెడుతున్నారు. ఒక్క ప్రసిద్ కృష్ణ మాత్రమే రాణించడం లేదు. మిగతావారందరు బాగానే ఆడుతున్నారు. దీంతో మూడో వన్డేలో ఎలాగైనా విజయం సాధించి కప్ గెలుచుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఇంగ్లండ్ కూడా అదే తీరుగా అడ్డుకోవాలని శతవిధాలా ప్రయత్నించేందుకే నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో రెండు జట్లు ఏ మేరకు రాణించి సిరీస్ దక్కించుకుంటాయో వేచి చూడాల్సిందే మరి.
Also Read:Victory Venkatesh: ఆ విషయం లో ఎంతమంది బ్రతిమిలాడినా ఒప్పుకోని విక్టరీ వెంకటేష్