India Vs England 1st Test: ఉప్పల్ లో టీమిండియాను ఓడించేదే లే.. ఇంగ్లండ్ తో తొలి టెస్ట్ వెన్యూ రికార్డులివీ…

ఉప్పల్ గ్రౌండ్ లో ఇండియన్ టీం కి అరుదైన రికార్డులు కూడా ఉన్నాయి.ఇప్పటివరకు ఇక్కడ 5 టెస్ట్ మ్యాచ్ లను ఆడిన ఇండియన్ టీం నాలుగు మ్యాచ్ ల్లో గెలిచి ఒక మ్యాచ్ ను డ్రా గా ముగించింది. ఇప్పటివరకూ అయిదు టెస్టులాడిన టీమ్‌ ఇండియా నాలుగు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

Written By: Neelambaram, Updated On : January 22, 2024 6:45 pm

India Vs England 1st Test

Follow us on

India Vs England 1st Test: ప్రస్తుతం ఇండియన్ టీమ్ వరుస మ్యాచ్ లు గెలుస్తూ మంచి దూకుడు మీద కనిపిస్తుంది. ఇక ఇప్పటికే అన్ని ఫార్మాట్ల ల్లో తన సత్తా చాటుకుంటూ ముందుకు కదులుతుంది. ఇక అందులో భాగంగానే ఈనెల 25వ తేదీ నుంచి ఇంగ్లాండ్ తో సిరీస్ ఆడటానికి ఇండియా రెఢీ అవుతుంది. ఇక ఈ సీరీస్ లో మొత్తం ఐదు మ్యాచు ఆడాల్సి ఉండగా ఇందులో మొదటి టెస్ట్ మ్యాచ్ ని హైదరాబాద్ వేదికగా ఉప్పల్ గ్రౌండ్ లో ఆడబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇండియా ఓటమి అనేది ఎరగని టీమ్ గా మంచి రికార్డ్ అయితే ఉంది.

ఇక ఈ పిచ్ ఇండియన్ టీమ్ కి కంచుకోట అనే చెప్పాలి.ఇక్కడ ప్రత్యర్థి ఎవరైనా సరే ఇండియన్ టీమ్ మ్యాచ్ మొత్తాన్ని వన్ సైడే చేసేస్తుంది. గెలుపు ఒకటే ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఇండియా మరోసారి తన సత్తా చాటడానికి సిద్ధమవుతోంది. అలాగని ఇంగ్లాండ్ టీమ్ ని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. బ్రెండన్ మెక్కలాం ఇంగ్లాండ్ టీమ్ కి కోచ్ గా వచ్చిన తర్వాత వాళ్ళు బజ్ బాల్ గేమ్ ఆడుతున్నారు. అందులో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు. ఇక ఇండియా మీద కూడా బజ్ బాల్ గేమ్ ని కంటిన్యూ చేస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

మరి ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ ఇండియన్ టీం ని ఎలా ఎదుర్కొంటుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సిరీస్ లో ఇండియా టీం గెలవడం చాలా కీలకం గా మారనుంది. ఎందుకంటే డబ్ల్యూటీసీ ఫైనల్ కి మన టీమ్ అర్హత సాధించాలి అంటే ఈ సిరీస్ గెలుపు చాలా కీలకంగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికి రెండుసార్లు డబ్ల్యుటిసి ఫైనల్ కెళ్ళి ఓడిపోయిన ఇండియన్ టీం వచ్చే సంవత్సరం జరగబోయే డబ్ల్యూటీసి ఫైనల్ కి వెళ్లి కప్పు కొట్టాలని చూస్తుంది. ఇక అందులో భాగంగా ఈ టెస్ట్ సిరీస్ ని గెలిచి తమ సత్తా చాటుకోవాలని ఇండియన్ టీమ్ చూస్తుంది…

ఇక ఉప్పల్ గ్రౌండ్ లో ఇండియన్ టీం కి అరుదైన రికార్డులు కూడా ఉన్నాయి.ఇప్పటివరకు ఇక్కడ 5 టెస్ట్ మ్యాచ్ లను ఆడిన ఇండియన్ టీం నాలుగు మ్యాచ్ ల్లో గెలిచి ఒక మ్యాచ్ ను డ్రా గా ముగించింది. ఇప్పటివరకూ అయిదు టెస్టులాడిన టీమ్‌ ఇండియా నాలుగు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

ఇక 2010 లో ఈ పిచ్ లో న్యూజిలాండ్ తో ఆడిన మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ హర్భజన్ సింగ్ 111 పరుగులు చేసి ఒక అద్భుతమైన సెంచరీ ని సాధించడమే కాకుండా నాటౌట్ నిలిచాడు. అలాగే 2012లో న్యూజిలాండ్ టీం పైన ఆడిన టెస్ట్ మ్యాచ్ లో ఇండియా 115 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక మ్యాచ్ లో పూజార 159 పరుగులు చేసి ఒక సెంచరీ ని సాధించడమే కాకుండా ఇండియన్ టీం కి మంచి విజయాన్ని అందించడంలో తను కీలకపాత్ర వహించాడు. ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ బౌలర్ అయిన అశ్విన్ కూడా 12 వికెట్లు తీసి తన సత్తా చాటుకున్నాడు…
ఇక 2013లో ఆస్ట్రేలియాను ఇన్నింగ్స్, 135 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా చిత్తు చేసింది. పుజారా (204) డబుల్‌ సెంచరీ చేశాడు.

2017వ సంవత్సరం లో బంగ్లాదేశ్‌తో ఆడిన ఏకైక టెస్టులో 208 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం సాధించింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి (204) డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.
2018లో వెస్టిండీస్‌తో టెస్టులో 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో పంత్‌ (92), రహానె (80), పృథ్వీ షా (70) సత్తా చాటారు. ఉమేశ్‌ యాదవ్‌ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.

ఇక విరాట్ కోహ్లీకి కూడా ఇక్కడ అద్భుతమైన రికార్డు అయితే ఉంది. అయినప్పటికీ విరాట్ కోహ్లీ ఈ టెస్ట్ మ్యాచ్ కి అందుబాటులో ఉండడం లేదు తన వ్యక్తిగత కారణాలవల్ల తను ఈ మ్యాచ్ నుంచి తప్పకున్నట్లు గా తెలుస్తుంది. ఇక ఇండియన్ టీమ్ ఈ మ్యాచ్ లో గట్టి పోటీ ఇస్తూ ఆడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం అంటే ఎక్కువగా స్పిన్ కి అనుకూలిస్తుంది. అందువల్ల మన స్పిన్నర్లు కూడా ఈ మ్యాచ్ లో కీలకపాత్ర వహించబోతున్నట్టుగా తెలుస్తుంది…మరి ఈ మ్యాచ్ లో ఇండియా తన సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ గెలుస్తుందా, లేదా ఇంగ్లాండ్ టీమ్ ఇండియా ను దెబ్బ కొడుతుందా అనేది తెలియాల్సి ఉంది…