India Vs Australia World Cup Final: ఇండియా ఆస్ట్రేలియా టీమ్ లా మధ్య ఈనెల 19 వ తేదీన జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ కోసం ప్రపంచం లో ఎన్నడు లేని విధంగా ఆ మ్యాచ్ కి ముందు మ్యాచ్ అనంతరం కూడా ఇండియా చాలా గొప్ప విన్యాసాలతో ప్రేక్షకులను అలరించబోతుంది…అవి ఎంటి అనేది మనం కూడా ఒకసారి తెలుసుకుందాం…
మొదటి సారి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ప్రపంచం లోనే అత్యంత పెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియం లో జరుగుతుంది…అది కూడా ఇండియాలో జరగడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి..
2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఇక వరల్డ్ కప్ టోర్నీ కి వీడ్కోలు పలుకుతున్న నేపధ్యం లో భారీ రేంజ్ లో వీడ్కోలు ఏర్పాటు ని నిర్వహిస్తున్నట్టు గా తెలుస్తుంది… అందులో భాగంగానే 4 విభాగాల్లో భారీ ఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు గా కూడా తెలుస్తుంది…
ఇక ఈ ఈవెంట్ స్కైలో ఇండియన్ టీమ్ కి సెల్యూట్ చేయడం తో ప్రారంభం కానుంది. ఇక ఇది 12 గంటల 30 నిమిషాలకి ప్రారంభం అయి 10 నిమిషాల పాటు అలాగే కొనసాగనుంది…ఇక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆసియాలోనే అత్యంత గొప్ప గా 9 హాక్ విన్యాసాల బృందం చేత ఫ్లైట్ కమాండర్ & డిప్యూటీ టీమ్ లీడర్ వింగ్ కమాండర్ సిదేశ్ కార్తీక్ ద్వారా వీటిని నిర్వహించడం అనేది నిజంగా ఇండియా కి గర్వకారణం అనే చెప్పాలి…
ఇక ఇందులో భాగంగానే 15 నిమిషాల పాటు భారత వైమానిక దళం ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఆకాశం నుండి సెల్యూట్ చేస్తుంది. ఇక ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 10 నిమిషాల పాటు చేసే ఎయిర్ షోతో ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక మొట్టమొదటి సారిగా నరేంద్ర మోడీ స్టేడియంలో 9 హాక్ విన్యాస ప్రదర్శన ఒక కొత్త భారతదేశానికి నంది పలుకుతూ సాగే మ్యూజిక్ ద్వారా దానికి శ్రీకారం చుట్టబోతున్నారు…
ఇక వీటితో పాటు ఛాంపియన్ల పరేడ్ కూడా సాగనుంది.చరిత్ర చూసుకుంటే ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్‌లను క్రికెట్‌లోని అతిపెద్ద ఎరేనాలో మొదటిసారిగా సన్మానించారు. ఇక ఇప్పుడు
ప్రతి ఛాంపియన్ FOPలో నడుస్తున్నప్పుడు వారు విజయం సాధించడానికి పోగుచేసుకున్న మేమరబుల్ మూవ్ మెంట్స్ ని 20 సెకన్ల రీల్ రూపం లో హైలైట్‌లతో రూపొందించి వాటిని పెద్ద స్క్రీన్ మీద టెలికాస్ట్ చేయడం జరుగుతుంది…ఇక దానితో పాటు గా గెలిచిన కెప్టెన్ గ్రౌండ్ లో ఉన్న యాంకర్ తో మాట్లాడుతూ వాళ్ల టీమ్ గెలుపు గురుంచి మాట్లాడుతాడు…
ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో సెకండ్ డ్రింక్స్ బ్రేక్ సమయంలో 90 సెకన్ల పాటు అంటే నిమిషంన్నర పాటు అంతర్జాతీయంగా డిజైన్ చేయబడిన లైట్లు మరియు లేజర్ షోతో పాటు స్టేడియం యొక్క మొత్తం పైకప్పును కాన్వాస్‌గా ఉపయోగించే ప్రత్యేకమైన విజువల్స్ ని కౌంట్ డౌన్ రూపం లో మనకు చూపించడం జరుగుతుంది…
ఇక ప్రపంచ ఛాంపియన్స్ కిరీటం అందుకునేటపుడు స్కై నుండి మొత్తం 1200 డ్రోన్‌ల సహాయం తో రాత్రి పూట ఆకాశంలో ఒక అద్భుతమైన విన్యాసలను చూడబోతున్నాం…అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద బాణసంచాలను కాల్చుతు ఇంతకు ముందు ఏ టోర్నీ లో గానీ, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారీ ఎత్తున ఇలా ఇండియా వరల్డ్ కప్ ఫైనల్స్ కోసం ఒక పెద్ద ఈవెంట్ ని జరపడం అనేది నిజంగా ప్రపంచ దేశాల కంటే ఇండియా తక్కువ కాదు అని చూపించడానికి కూడా ఒక సంకేతం గా భావించవచ్చు… ఇక ఈ ఫైనల్ లో ఇండియా బాగా ఆడి కప్పు గెలవాలని కోరుకుందాం…