India Vs Australia Boxing Day Test: మెల్ బోర్న్ లో ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్ట్ జరుగుతోంది. ఈ టెస్ట్ లో గెలవాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఈ టెస్ట్ లో గెలిస్తేనే టీమిండియాకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా కూడా ప్రయోగాల జోలికి వెళ్లకుండా.. ఈ టెస్టులో గెలిచి ఆత్మ స్థైర్యాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. అందువల్ల ఈ రెండు జట్లు కూడా తుదికూర్పులో మార్పులు చేర్పులు చేశాయి. మెల్ బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో సామ్ కాన్ స్టాస్ భుజాన్ని టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ తాకడం సంచలనంగా మారింది. ఇది ఐసీసీ క్రమశిక్షణ రాహిత్య చర్య కిందికి వస్తుందని మాజీ ఆటగాళ్లు అంటున్నారు. కోహ్లీ చేసింది తప్పని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ ఇప్పటికే వ్యాఖ్యానించాడు. కోహ్లీ, కాన్ స్టాస్ మధ్య వాగ్వాదం జరగడంతో.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా రంగంలోకి వచ్చి.. గొడవను చల్ల పరిచే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే కొన్ స్టాస్, విరాట్ మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది.
నిబంధనలు ఎలా ఉన్నాయి అంటే
క్రికెట్ లో ఐసీసీ విధించిన నిబంధనల ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆటగాళ్ల మధ్య ఎటువంటి శారీరక వాగ్వాదానికి తావులేదు. ఒక ఆటగాడు ఉద్దేశపూర్వకంగా లేదా నిర్లక్ష్యంగా నడవడం నేరం. ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగా అంపైర్ పైకి వెళ్లకూడదు. ఇలా చేస్తే ఆటగాళ్లు తప్పు చేసినట్టు మ్యాచ్ రిఫరీ భావిస్తారు. దీనిని మ్యాచ్ ఉల్లంఘన గా పరిగణించి.. ఆటగాడు చేసిన తప్పు ఆధారంగా చర్యలు తీసుకుంటారు.. నిర్దిష్ట పరిస్థితి, దాని సందర్భం, పరిమితి లేకుండా పరిచయం, ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఆటగాడి ఉద్దేశపూర్వక ప్రవర్తన వల్ల ఎదుటి ఆటగాడికి జరిగిన గాయం లేదా కలిగిన బాధ వంటి వాటిని పరిగణలోకి తీసుకొని ఐసిసి చర్యలు తీసుకుంటుంది.
పై క్రాఫ్ట్ ఏం చేస్తారో
నాలుగో టెస్ట్ కు మ్యాచ్ రిఫరీగా జింబాబ్వే మాజీ ఆటగాడు అండి పై క్రాఫ్ట్ వ్యవహరిస్తున్నారు. కోహ్లీ చేసిన దానిని లెవెల్ -2 నిర్ణయంగా పై క్రాఫ్ట్ భావిస్తే.. అప్పుడు విరాట్ మూడు లేదా నాలుగు డి మెరిట్ పాయింట్లను పొందుతాడు.. ఒకవేళ నాలుగు డి మెరిట్ పాయింట్లు కోహ్లీ కనక పొందితే సిడ్నీ వేదికగా జరిగే చివరి టెస్టులో కోహ్లీ ఆడే అవకాశాన్ని కోల్పోతాడు. ఒకవేళ కోహ్లీ చేసిన పనిని లెవెల్ -2 నేరంగా మ్యాచ్ రిఫరీ భావిస్తే.. కోహ్లీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే మ్యాచ్ రిఫరీ దీనిని ఏ విధంగా పరిగణిస్తారు అనేది వేచి చూడాల్సి ఉంది. గతంలో మంకీ గేట్ వివాదం జరిగినప్పుడు.. హర్భజన్ సింగ్ ను ఐసీసీ దోషిగా చూసినప్పుడు.. బీసీసీఐ ఒక్కసారిగా మండిపడింది. సిరీస్ మొత్తాన్ని బాయ్ కట్ చేస్తామని హెచ్చరించింది. ఆ తర్వాత ఐసీసీ దిగివచ్చింది. హర్భజన్ పై ఎటువంటి చర్యలు తీసుకోకుండానే తదుపరి సిరీస్ కొనసాగించింది. అయితే ఇప్పుడు ఒకవేళ మ్యాచ్ రిఫరీ విరాట్ కోహ్లీపై చర్యలు తీసుకుంటే బీసీసీఐ ఈ సిరీస్ ను బై కాట్ చేస్తుందా? లేక కొనసాగిస్తుందా? అనేది చూడాల్సి ఉంది.
బాక్సింగ్ డే టెస్టులో టీమ్ ఇండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కొన్ స్టాస్ ను స్లెడ్జింగ్ చేశాడు. అతడి భుజాన్ని తాకుకుంటూ వచ్చాడు.. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. #BoxingDayTest #AUSvIND pic.twitter.com/n3K94AsvQX
— Anabothula Bhaskar (@AnabothulaB) December 26, 2024