IND vs AUS : మూడు వన్డే లో ఆసీస్ 269 పరుగులకు ఆల్ ఔటయింది. బుధవారం చెన్నై వేదికగా చేపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ తీసుకున్న నిర్ణయాన్ని జస్టిఫై చేస్తూ ఆస్ట్రేలియన్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. హెడ్, మార్ష్ తొలి వికెట్ కు 60 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వీరి జోడిని హార్దిక్ పాండ్యా విడదీశాడు.. 10.5 ఓవర్ లో హార్దిక్ పాండ్యా వేసిన బంతిని భారీ షాట్ కొట్టిన హెడ్.. లాంగ్ ఆన్ లో ఉన్న కులదీప్ యాదవ్ కు దొరికిపోయాడు. దీంతో భారత శిబిరంలో హర్షం వ్యక్తం అయింది. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన స్మిత్ హార్దిక్ బౌలింగ్ లోనే గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు.. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 12.2 ఓవర్లలో 74.. ఇదే సమయంలో హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చిన మార్ష్(47) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
మార్ష్ అవుట్ అయిన తర్వాత డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ కు వచ్చాడు. అతడు నిదానంగా ఆడుతున్న క్రమంలో కులదీప్ యాదవ్ కు దొరికిపోయాడు. 24.3 ఓవర్ లో కులదీప్ యాదవ్ వేసిన బంద్ కి హార్దిక్ పాండ్యా కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. అప్పటికి అతని స్కోరు 23. ఇక ఇదే దశలో 28.1 ఓవర్ వద్ద కులదీప్ యాదవ్ మార్నస్ లబుషేన్ ను అవుట్ చేశాడు. ఇప్పటికీ అతని స్కోరు 28..ఈ క్రమంలో అలెక్స్ క్యారీ (38), మార్కస్ స్టోయినీస్ (25) ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ వీరిలో క్యారీ ని కులదీప్, స్టోయినీస్ ను అక్షర్ ఔట్ చేశారు.. వీరు ఔటయ్యే సమయానికి 38.1 ఓవర్లలో 203. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన సీన్ అబాట్(26) మెరుపులు మెరిపించినప్పటికీ ఎక్కువ సేపు క్రీజు లో ఉండలేకపోయాడు.. ఇతడిని అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత అస్టన్ అగార్(17), మిచెల్ స్టార్క్(10)ను సిరాజ్ ఔట్ చేశాడు. ఆడమ్ జంపా(10) నాట్ అవుట్ గా నిలిచాడు. మొత్తానికి 49 ఓవర్లలో ఆస్ట్రేలియా 269 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.. స్మిత్ తమపై ఉంచిన నమ్మకాన్ని ఆస్ట్రేలియా ఓపెనర్లు నిలబెట్టుకున్నారు..మార్ష్(47 బంతుల్లో 47, 8 ఫోర్లు, ఒక సిక్స్), హెడ్(31 బంతుల్లో 33, 4 ఫోర్లు, 2 సిక్స్ లు) వీరవిహారం చేశారు. 10.4 ఓవర్లలోనే 60 పరుగులు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడిని హార్దిక్ పాండ్యా విడదీశాడు. 10.5 ఓవర్లో హార్దిక్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టిన హెడ్…లాంగ్ ఆన్ లో ఉన్న కుల దీప్ కు దొరికిపోయాడు. దీంతో భారత శిబిరంలో హర్షం వ్యక్తం అయింది. వన్ డౌన్ గా బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ హార్దిక్ బౌలింగ్ లోనే గోల్డెన్ డక్ గా వెను తిరిగాడు. 12.2 ఓవర్ లో ఆస్ట్రేలియా స్కోరు 74 పరుగులుగా ఉన్నప్పుడు.. హార్దిక్ వేసిన అద్భుతమైన ఇన్ స్వింగర్ ను ఆడబోయిన స్మిత్.. కీపర్ రాహుల్ కి దొరికిపోయాడు. ఇదే ఊపులో హాఫ్ సెంచరీ కి చేరువగా ఉన్న మార్ష్ వికెట్ ను కూడా హార్దిక్ తీశాడు.. 14.3 ఓవర్ లో ఆస్ట్రేలియా స్కోర్ 85 పరుగుల వద్ద ఉన్నప్పుడు మార్ష్ ఔట్ అయ్యాడు. పాండ్యా వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన మార్ష్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. అప్పటికి తడి స్కోర్ 47 పరుగులు.. దీంతో నిరాశగా మైదానం వీడాడు.
అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా ఓపెనర్లను విడదీసేందుకు మార్చి మార్చి బౌలింగ్ చేయించినా ఉపయోగం లేకుండా పోయింది.. సిరాజ్, షమీ, అక్షర్ పటేల్, జడేజా, కుల దీప్ యాదవ్ ను ప్రయోగించినా హెడ్, మార్ష్ స్వేచ్ఛగా పరుగులు తీశారు.. కానీ ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా బంతి అందుకున్నాడో అప్పుడే మ్యాచ్ స్వరూపం మారిపోయింది.. 68 పరుగులతో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియా 17 పరుగుల వ్యవధిలోనే ఇద్దరు ఓపెనర్లు,కెప్టెన్ వికెట్లు కోల్పోయింది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: India vs australia 3rd odi team india target 270
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com