India vs Australia 2nd ODI: టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్, ఇటీవల కాలంలో ఛాంపియన్స్ ట్రోఫీ అందించి సంచలనం సృష్టించాడు సారధి రోహిత్ శర్మ. జట్టులో మారిన పరిస్థితుల నేపథ్యంలో రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్ నుంచి సారధిగా తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్ లో అతడు సాధారణ ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. పెర్త్ లో జరిగిన తొలి వన్డేలో రోహిత్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. పైగా బ్యాటింగ్ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఓపెనర్ గా రంగంలోకి వచ్చిన అతడు.. భారీ స్కోర్ చేయకుండానే వెనక్కి వచ్చేసాడు.
ఈ నేపథ్యంలో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్లో రోహిత్ అదరగొట్టాడు. కొంతకాలంగా తన మీద జరుగుతున్న ప్రచారానికి గట్టిగా బదులు చెప్పాడు. బరువు తగ్గిన అతడు.. క్రికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టాడు. ఆస్ట్రేలియా బౌలర్ల దూకుడు వల్ల గిల్(9), విరాట్ కోహ్లీ (0) త్వరగానే అవుట్ కావడంతో ఇండియా దారుణమైన కష్టాల్లో పడింది. 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో మరో ఆటగాడు అయ్యర్ (61) తో కలిసి రోహిత్ శర్మ (73) మూడో వికెట్ కు 118 పరుగులు జోడించాడు. 97 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 73 పరుగులు చేసిన రోహిత్.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలకమైన ఇన్ని ఆడటమే కాకుండా.. అదరగొట్టాడు . వాస్తవానికి అతడి శైలికి భిన్నంగా రోహిత్ బ్యాటింగ్ చేశాడు. పదునైన బంతులు వస్తున్నప్పుడు డిఫెన్స్ ఆడాడు. చెత్త బంతులను మరో మాటకు తావులేకుండా బౌండరీలకు తరలించాడు.
తాజా హాఫ్ సెంచరీ ద్వారా రోహిత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 267 ఇన్నింగ్స్ లు ఆడిన రోహిత్.. 11,226 పరుగులు పూర్తి చేశాడు. ఇతడు యావరేజ్ 48.81 గా ఉంది. స్ట్రైక్ రేట్ 92.61 గా ఉంది. రోహిత్ తాజా హాఫ్ సెంచరీ ద్వారా అతడి ఖాతాలో 59 వ అర్థ శతకం నమోదయింది. రోహిత్ ఖాతాలు ఇప్పటికే 32 సెంచరీలు ఉన్నాయి. ఇదే ఆస్ట్రేలియా మీద రోహిత్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.. తాజా హాఫ్ సెంచరీ ద్వారా రోహిత్ అదరగొట్టాడు. కష్టకాలంలో జట్టును ఆదుకొని ఆపద్బాంధవుడిగా నిలిచాడు. వన్డే వరల్డ్ కప్ లో చోటు దక్కదు.. అతడికి అవకాశం ఉండదని ఇటీవల కాలంలో వార్తలు వస్తున్న నేపథ్యంలో.. తాను ఎంత ముఖ్యమైన ఆటగాడినో నిరూపించాడు రోహిత్.