India Vs Afghanistan: వరల్డ్ కప్ లో బాగంగా ఇండియా తన రెండో మ్యాచ్ ఆడడానికి సిద్ధమవుతుంది.రీసెంట్ గా ఇండియా ఆస్ట్రేలియా తో ఆడిన మొదటి మ్యాచ్ లో భారీ విజయాన్ని అందుకోవడంతో ఆస్ట్రేలియా పైన ఇండియా వరల్డ్ కప్ లో శుభారంభాన్ని కొట్టింది.ఇక ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఆఫ్ఘనిస్తాన్ తో ఇండియా మ్యాచ్ ఆడనుంది. నిజానికి ఆస్ట్రేలియా లాంటి ఒక పెద్ద దేశాన్ని చిత్తు చేసిన ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్ ని ఓడించడం పెద్ద విషయమైతే కాదు…కానీ ఆ టీం ని కూడా మనం అంత తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్లు ఇప్పటికే సంచలనాలు క్రియేట్ చేసిన మ్యాచులు చాలా ఉన్నాయి. అలాంటి సిచువేషన్ లో ఇండియా జాగ్రత్తగా ఆడితే తప్ప వీళ్ళ మీద మనం మ్యాచ్ గెలవలేము. అందువల్ల ఇండియా టీం లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా చాలా జాగ్రత్తగా ఆడాలి అలా కాకుండా వీళ్ళు చిన్న దేశం కదా మన టీం ని ఏం చేస్తారు అని ఇండియా టీమ్ ఏ కొంచం నిర్లక్ష్యం వహించిన కూడా జరిగే అనర్థాలకు ఇండియన్ టీమ్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.
ఇక వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయకుండా ఆడితే బాగుంటుందని మన సీనియర్ క్రికెటర్లు సైతం ఇండియన్ టీం కి సలహాలు ఇస్తున్నారు… ఇక శుభ్ మన్ గిల్ డెంగ్యూ ఫీవర్ నుంచి పూర్తి గా కోలుకోకపోవడం వల్ల ఆయన ఈ మ్యాచ్ కి అందుబాటులో ఉండరనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.ఇక గిల్ ప్లేస్ లో ఈ మ్యాచ్ లో మళ్ళీ ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నట్టుగా తెలుస్తుంది. ఇషాన్ కిషన్ కూడా మంచి ప్లేయర్ ఆయన ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలిగితే ఇండియన్ టీమ్ కి భారీ స్కోరు ఈజీగా వస్తుంది. ఇక ఈ మ్యాచ్ న్యూ ఢిల్లీ వేదికగా ఆడుతున్నారు కాబట్టి అది ఎక్కువగా బ్యాటింగ్ కి అనుకూలించే పిచ్ కావడం వల్ల అక్కడ రెండు టీములు కూడా భారీ స్కోర్ చేయగలుగుతాయి.
ఇక ఇలాంటి సిచువేషన్ లో ఇండియన్ టీమ్ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఇలా గనక జరిగితే రవిచంద్రన్ అశ్విన్ బెంచ్ కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. ముగ్గురు పేసర్లలో మహమ్మద్ షమీ గానీ లేదా శార్దూల్ ఠాకూర్ ని గాని తీసుకునే అవకాశాలు ఉన్నాయి.ఇక బౌలింగ్ మీద ఎక్కువ డిపెండ్ అయితే మాత్రం మహమ్మద్ షమీ ని తీసుకుంటారు. అదే బ్యాటింగ్ కూడా అనుకూలంగా ఉండాలి అంటే ఎనిమిదవ పొజిషన్ లో వచ్చే ప్లేయర్ కూడా బ్యాటింగ్ చేయాలి అని అనుకున్నట్టయితే శార్డుల్ ఠాకూర్ ని తీసుకుంటారు. ఒకసారి ఇండియన్ ప్లేయింగ్ లెవెల్ ని కనుక చూసుకుంటే ఓపెనర్ గా ఇషాన్ కిషన్ ,రోహిత్ శర్మ ఇద్దరూ ఉన్నారు. మూడో నెంబర్ బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ ,నాలుగో నెంబర్ బ్యాట్స్ మెన్స్ గా శ్రేయాస్ అయ్యర్, ఐదో నెంబర్ బ్యాట్స్ మెన్ గా కే ఎల్ రాహుల్,నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ సెవెన్ లో రవీంద్ర జడేజా, నెంబర్ ఎయిట్ లో కుల్దీప్ యాదవ్ ,నెంబర్ నైన్ లో మహమ్మద్ సిరాజ్ ,మహమ్మద్ షమీ, నెంబర్ 11 లో బూమ్రా…లు ఉంటారు…