India Vs West Indies: భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య రెండవ టీ20 మ్యాచ్ ఆదివారం నాడు గయానాలోని ప్రొవిడెన్స్ లో జరగనుంది. మొదట టి20 మ్యాచ్ ఓడిపోయిన భారతకు ఈ మ్యాచ్లో గెలుపు ఎంతో ప్రధానమైనది. మొన్న ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ ఫలితం అందరికీ తెలిసిందే.రోవ్‌మన్ పావెల్ నేతృత్వంలో చెలరేగిన వెండిసి జట్టు నాలుగు పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. భారత్ జట్టు పేలవమైన పర్ఫామెన్స్ తో పాటు చేసిన చిన్న తప్పిదాల కారణంగా గెలవవలసిన మ్యాచ్ చేయి జారిపోయింది.
ట్రినిడాడ్ వేదికగా గురువారంనాడు జరిగిన మ్యాచ్లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 150 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక 145 పరుగులను సాధించి 9 వికెట్లు సమర్పించింది. ఈ క్రమంలో చిన్న తప్పుల వల్ల మ్యాచ్ గెలిచాము కానీ లేకపోతే కష్టమే అని అర్థం చేసుకున్న విండీస్ జట్టు జరగబోయే రెండవ మ్యాచ్ లో కూడా తమ ఆధిపత్యం కొనసాగించడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది.
ఈ మ్యాచ్ గురించి నెట్ కూడా పలు రకాల అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ కూడా టీమిండియా కేవలం ఎక్స్పరిమెంట్స్ కి పరిమితం కావడం పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క మెరుపు మెరుపు ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మ పర్ఫామెన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో భారత్ జట్టు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే విండీస్ టీం మాత్రం సంచల నిర్ణయం తీసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ప్లేయర్స్ కు ఈ మ్యాచ్లో బెంచ్ మార్గం చూపించే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
విండీస్ వర్సెస్ భారత్ తొలి టీ20 మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన కనబరచని ముగ్గురు ప్లేయర్స్ పై విండీస్ జట్టు వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో కేవలం మూడు పరుగులకు మాత్రమే పరిమితమైన జాన్సన్ చార్లెస్ పై మొదటి వేటు పడే అవకాశం ఉంది. కేవలం ఆరు బంతులను ఎదుర్కొన్న ఈ 34 ఏళ్ల వెస్టిండీస్ క్రికెటర్ మూడు పరుగులు సాధించి కులదీప్ యాదవ్ చేతిలో అవుటయ్యాడు.
ఇక రెండవ స్థానం అల్జారీ జోసెఫ్ కావచ్చు అని తెలుస్తోంది. అయితే జోసఫ్ కు విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ గట్టి సపోర్ట్ ఉంది. అతను మెరుగైన ప్రదర్శన కనబరుస్తాడు అన్న పావెల్ నమ్మకాన్ని అతను నిలబెడతాడా లేదా అనేది చూడాలి. కానీ అతను మొదటి టీ20 మ్యాచ్లో అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసిన జోసెఫ్ 9.8 ఎకానమీ రేట్ తో 39 పరుగులు ఇచ్చాడే తప్ప ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు.
ఇక మూడవ బెంచ్ ప్లేయర్ విండీస్ ఓపెనర్ కైల్ మేయర్స్ అని అంచనా. ఈ సిరీస్ ఓపెనింగ్ టీ20 మ్యాచ్లో మేయర్స్ కేవలం ఒక్క పరుగు చేసి పెవీలియన్ కు చేరాడు. 8 టెస్ట్ మ్యాచెస్, 28 వన్డేలు,25 టీ20 లు ఆడిన అనుభవం ఉన్నా అతను కేవలం ఆరు బంతులు ఎదుర్కొని 1 పరుగు చేసి వెను తిరగడం విండీస్ అభిమానులను నిరాశపరిచింది. ఒకపక్క ఓడిపోతామేమో అన్న భయంతో ప్రత్యర్థి జట్టు కాస్త అటు ఇటు ప్రదర్శన కనబరిస్తున్న ఆటగాలను నిర్ధాక్షణ్యంగా బెంచ్ పై కూర్చో పెడుతుంటే భారత్ మాత్రం బలహీన పడుతున్న మిడిల్ ఆర్డర్ ను గర్వంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కనీసం జరగబోయే రెండవ మ్యాచ్ కోసం అయినా భారత్ మెరుగైన నిర్ణయం తీసుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు.