https://oktelugu.com/

India vs Pakistan Asia Cup: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. ఎవరికి గెలిచే ఛాన్స్ ఎక్కువ?

India vs Pakistan Asia Cup: గత టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ పై టీమిండియా ఓటమి ఎవరూ మరిచిపోలేదు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి ఎసరు వచ్చింది ఆ మ్యాచ్ లోనే.. అప్పటి నుంచి కోహ్లీని పక్కకు తప్పించడం.. మ్యాచ్ లనుంచి పక్కనపెట్టడంతో తాను మానసికంగా కృంగిపోయానని తాజాగా పరోక్షంగా చెప్పుకొచ్చాడు. దాదాపు నెల రోజులు బ్యాట్ పట్టుకోలేదట.. తాజాగా కోహ్లీకి టీ20లో 100వ మ్యాచ్.. పాకిస్తాన్ తోనే జరుగబోతోంది. ఆసియాకప్ వేదికగా దుబాయ్ లో పాకిస్తాన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 28, 2022 / 09:25 AM IST
    Follow us on

    India vs Pakistan Asia Cup: గత టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ పై టీమిండియా ఓటమి ఎవరూ మరిచిపోలేదు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి ఎసరు వచ్చింది ఆ మ్యాచ్ లోనే.. అప్పటి నుంచి కోహ్లీని పక్కకు తప్పించడం.. మ్యాచ్ లనుంచి పక్కనపెట్టడంతో తాను మానసికంగా కృంగిపోయానని తాజాగా పరోక్షంగా చెప్పుకొచ్చాడు. దాదాపు నెల రోజులు బ్యాట్ పట్టుకోలేదట.. తాజాగా కోహ్లీకి టీ20లో 100వ మ్యాచ్.. పాకిస్తాన్ తోనే జరుగబోతోంది. ఆసియాకప్ వేదికగా దుబాయ్ లో పాకిస్తాన్ తో టీమిండియా పోరుకు ఈరోజు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీపైనే అందరి అంచనాలున్నాయి. ఆడితే అతడు వచ్చే ప్రపంచకప్ టీ20లో ఉంటాడు. లేదంటే రిటైర్ కావడం గ్యారెంటీ.

    rohit, babbar

    ప్రపంచమంతా ఈ రెండు శత్రుదేశాల మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంటాయి. టోర్నీ ఏదైనా సరే భారత్-పాక్ తలపడుతున్నాయంటే రెండు దేశాల అభిమానులు దాన్నొక యుద్ధంలాగానే చూస్తాయి. రెండూ జట్ల ఆటగాళ్లు కూడా సైనికుల్లా పోరాడుతాయి. ఉద్వేగం తారాస్తాయికి చేరుతుంది.

    Also Read: Annapurnamma Remuneration: జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో అన్నపూర్ణమ్మ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

    ప్రపంచకప్ లలో ఒక్కసారి కూడా పాకిస్తాన్ చేతిలో ఓడిపోని చరిత్రను గత ప్రపంచకప్ టీ20లో తిరగబడింది. పాకిస్తాన్ చేతిలో భారత్ చిత్తుచిత్తుగా ఓడింది. 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఆ తర్వాత కోహ్లీ కెప్టెన్సీ పోయి రోహిత్ శర్మకు పగ్గాలు దక్కాయి. ఈరోజు ఆసియా కప్ లో మరోసారి భారత్-పాక్ లు తలపడుతున్నాయి. ఈసారి గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు పట్టుదలగా ఉంది.అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

    -టీమిండియాలో ఎవరెవరికి చోటు..?
    కేఎల్ రాహుల్ చాలా రోజుల తర్వాత ఎంట్రీ ఇవ్వడంతో డ్యాషింగ్ వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ కు చోటు కష్టమేనంటున్నారు. ఓపెనర్లుగా రోహిత్, కేఎల్ రాహుల్, వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ, నాలుగోస్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5వ స్తానంలో హార్ధిక్ పాండ్యా, ఆరో స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక 7వ స్తానంలో ఆల్ రౌండర్ రవీంద్రజడేజాను తీసుకునే అవకాశాలు ఎక్కువ. ఇక బౌలర్లలో భువనేశ్వర్ తోపాటు ఆవేష్ ఖాన్, అర్షదీప్ తోపాటు స్పిన్నర్ గా బిష్ణోయ్ /అశ్విన్/చాహల్ లలో ఒకరిని తీసుకోవచ్చు.

    India vs Pakistan Asia Cup

    -పాకిస్తాన్ లో ఎవరెవరికి చోటు?
    ఇక పాకిస్తాన్ బౌలింగ్ బలహీనమైంది. షాహిన్ ఆఫ్రిది గాయంతో దూరం కావడం ఆ జట్టును దెబ్బతీసింది. ఇక కెప్టెన్ బాబర్, రిజ్వాన్, జమాన్, హైదర్ అలీ, షాదాబ్ తో పటిష్టంగా ఉంది. ఇఫ్తికార్, నవాజ్ , హుస్సేన్, నసీమ్ ,ఖాదిర్, దహానీలకు చోటు ఉండొచ్చు. పోయినసారి పట్టుదలగా ఆడిన పాకిస్తాన్ ఈసారి టీమిండియాను ఎలా ఎదుర్కొంటుందన్నది వేచిచూడాలి.

    -టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే.?
    దుబాయ్ లోని ఇసుక పిచ్ లపై టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే.. నిన్న శ్రీలంక-అప్ఘనిస్తాన్ మ్యాచ్ లో కూడా ఇదే నిరూపితమైంది. టాస్ గెలిచిన అప్ఘినిస్తాన్ ఈజీగా గెలిచింది. రెండోసారి బ్యాటింగ్ చేయడం ఇక్కడ చాలా ఈజీ. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. పోయిన టీ20 ప్రపంచకప్ లోనూ టీమిండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసి ఓడింది. ఈసారి టాస్ భారత పక్షాన నిలవాలని అందరూ కోరుకుంటున్నారు. ఓవరాల్ గా చూస్తే పాకిస్తాన్ తో పోలిస్తే టీమిండియా పటిష్టంగా ఉంది. కానీ పాక్ ను తక్కువ అంచనావేయడానికి లేదు. టీ20 అంటేనే మిస్టరీ.. ఆరోజు బాగా ఆడిన జట్టే గెలుస్తుంది.

    Also Read:JP Nadda -Nithin: హీరోలతో బీజేపీ పెద్దల భేటిలు అందుకే.. నితిన్ తో జేపీ నడ్డా మీటింగ్ సీక్రెట్స్ లీక్.!

    Tags