India vs West Indies 2nd T20: రోహిత్ కెప్టెన్సీలో ఇప్పటికే వన్డే సిరీస్‌ను గెలుచుకున్న టీమ్ ఇండియా.. ఇప్పుడు టీ20 సిరీస్ పై కన్నేసింది. ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న మ్యాచ్ ఈరోజు స్టార్ట్ కాబోతోంది. ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్‌ను గెలుచుకున్న రోహిత్ సేన.. రెండో మ్యాచ్ లో నెగ్గి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇక అటు వెస్టిండీస్ కూడా ఈ మ్యాచ్ లో గెలిచి తమ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఇరు జట్ల రికార్డులను ఓ సారి పరిశీలిద్దాం.
ఈడెన్ గార్డెన్ అంటేనే బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామం లాంటిది. కానీ ప్రతి జట్టు కూడా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలని అనుకుంటుంది. ఎందుకంటే ఈవినింగ్ సమయంలో మంచు ఎక్కువగా పడే ఛాన్స్ ఉంటుంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే టీమ్ ఇండియాది పైచేయి. అలాగే బౌలింగ్ కూడా గతంలో కంటే మెరుగ్గా ఉంది. ఇక ఫీల్డింగ్ విషయంలోనూ ఇండియా ఫీల్డర్లు మేలు.
Also Read: యూపీ అభ్యర్థుల్లో నేరస్తులు, కోటీశ్వరులే ఎక్కువా?
ఇక వెస్టిండీస్ కు పెద్ద ఆయుధం అయిన స్టార్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఇండియా విషయానికి వస్తే మాత్రం మన ఆల్ రౌండ్లర్ఉ గాయపడ్డార కాబట్టి ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ బౌలింగ్ చేయగలిగే బ్యాట్స్ మెన్ కు అవకాశం ఇస్తే దీపక్ హుడా కూడా ఆడనున్నాడు.
దీప్‌క్ హుడా మిడిల్ ఆర్డర్ లో బౌలింగ్ బాగానే చేస్తాడు. అంతే కాకుండా స్పిన్ బౌలింగ్‌లోనూ రాటు దేలి ఉన్నాడు. ఇక ఈ సిరీస్ కూడా గెలిస్తే రోహిత్‌కు తిరుగుండదనే చెప్పాలి. కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గెలిచిన తొలి టీ20 కూడా ఇదే అవుతుంది. అదే జరిగితే ఆయన మీద వచ్చిన విమర్శలకు ఇక చెక్ పడినట్టే అంటున్నారు క్రికెట్ నిపుణులు.
Also Read: మేడారానికి కేసీఆర్.. అమ్మవార్ల కోసం నిర్ణయం