India Vs South Africa: ఇండియన్ టీం ప్రస్తుతం సౌతాఫ్రికా తో మూడు ఫార్మాట్ లో సిరీస్ లో అనడానికి రెడీగా ఉంది. ఇక రేపు జరగబోయే మొదటి టి 20 మ్యాచ్ కి ఇండియన్ ప్లేయర్లు సర్వం సిద్దం చేసి మ్యాచ్ ఆడటానికి రెఢీ గా ఉన్నారు. ఇక ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నిరూపించుకుందామని చూస్తున్న మన ఇండియన్ ప్లేయర్లు సౌతాఫ్రికా ని చిత్తు చేయడానికి రెడీ అయ్యారు. ఇక మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికా ని ఓడించి వాళ్ళని సైకలాజికల్ గా దెబ్బ కొట్టాలని మన ప్లేయర్లు చూస్తున్నారు.
ఎందుకంటే మొదటి మ్యాచ్ లో కనక ఇండియా విజయం సాధిస్తే మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఒక మ్యాచ్ లో గెలిస్తే సీరీస్ మనది అవుతుంది. కాబట్టి మొదటి మ్యాచ్ అనేది మనకు చాలా కీలకంగా మారుతుంది.ఇది మనం గెలిస్తే వాళ్లు కూడా కొంచెం టెన్షన్ లో పడతారు ఇక వాళ్లు రెండో మ్యాచ్ ల్లో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. బేసిక్ గా సౌతాఫ్రికా వాళ్ళు ప్రేజర్ ని తట్టుకోలేరు అలాగే నాకౌట్ మ్యాచ్ లలో అయితే వాళ్ళు గెలవడం చాలా కష్టం…అందుకే మొదటి మ్యాచ్ మనం గెలిస్తే, సెకండ్ మ్యాచ్ వాళ్ళకి నాకౌట్ మ్యాచ్ లాంటిదే కాబట్టి మొదటి మ్యాచ్ లో ఇండియన్ టీమ్ గెలుపు చాలా కీలకమైనట్టుగా తెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ప్లేయర్లు తమ పూర్తి బాధ్యత నిర్వర్తించాలని చూస్తున్నారు. ఇక బ్యాట్స్ మెన్స్ అయిన యశస్వి జైష్వాల్, శుభ్ మన్ గిల్ లాంటి ప్లేయర్లు భారీ స్కోరు చేసే విధంగా ఆడుతూ ముందుకు కదిలే అవకాశం అయితే ఉంది…
ఇక ఈ టి 20 సిరీస్ లో బాగా ఆడిన ప్లేయర్లు టి 20 వరల్డ్ కప్ కి కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రతిభ చూపించడం అనేది చాలా కీలకంగా మారనుంది.ఇక ఈ సమయాన్ని మిస్ చేసుకుంటే మాత్రం ప్లేయర్లు భారీగా నష్టపోతారనే చెప్పాలి. ఎందుకంటే వరల్డ్ కప్ లో ప్లేస్ రావాలి అంటే ఇప్పటినుంచి జాగ్రత్తగా ఆడుకుంటూ వెళ్తేనే సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం అయితే ఉంది. కాబట్టి జైశ్వాల్ గానీ,రుతురాజ్ గైక్వాడ్ కానీ ఎక్కువ ఫోకస్ పెట్టి ఆడితే మంచిది.
ఎందుకంటే వీళ్ళకి టీమ్ లోకి రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఇషాన్ కిషన్ కూడా మంచి పర్ఫామెన్స్ అయితే ఇవ్వాలి. లేకపోతే అతని ప్లేస్ కి కూడా చెక్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి… ఎందుకంటే టీంలో ఎక్కువ మంది ప్లేయర్లు ఉండిపోవడంతో ప్లేయర్లకు ప్లేయర్లకు మధ్య పోటీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఒక్క మ్యాచ్ సరిగ్గ ఆడకపోయిన కూడా ఆయన ప్లేస్ లో ఇంకో ప్లేయర్ ని తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.ముఖ్యంగా ఐపీఎల్ లో ఎవరైతే బాగా అడుతారో వాళ్లని టి20 వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం తీసుకునే అవకాశం అయితే ఉంది.