India Vs Ireland T20: ఐర్లాండ్ తో భారత్ జరిపిన టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ ఆటకు వరుణుడు అడ్డం పడడంతో వాన గెలుస్తుందా? లేక టీం గెలుస్తుందా? అన్న ఆలోచనలకు వానే గెలిచినట్లయింది. భారత్ ముందు ఐర్లాండ్ తక్కువ స్కోరు ఉంచినా దానిని ఛేదించడం కష్టంగా మారింది. దీంతో వరుణుడు తోడుతో భారత్ కు ప్రయోజనం చేకూరింది. ఈ మ్యాచ్ మధ్యలో ప్రారంభమైన వర్షం ఎంతటికీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతితో భారత్ ను విజేతగా ప్రకటించారు. ఈ ఆటతో బూమ్రా టీం కు కాస్త ఊరట లభించినట్లయింది. ఇక రెండో టీ20 ఆగస్టు 20న జరగనుంది. ఈ మ్యాచ్ మరింత కీలకంగా మారింది.
ద్వితీయ శ్రేణి జట్టు అయిన ఐర్లాండ్ తో భారత్ మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా శుక్రవారం తొలి మ్యాచ్ ఆడింది. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచింది. అయితే వాతావరణ పరిస్థితులను గమనించిన బూమ్రా టీం ముందుగా బౌలింగ్ ను ఎంచుకుంది. ఐర్లాండ్ తమకు సరైనదే అనే ఉద్దేశంతో బ్యాటింగ్ చేపట్టింది. అయితే అనుకున్న విధంగానే మన బౌలర్లు చెలరేగిపోయారు. 59 పరుగులకే 6 వికెట్లు తీశారు. దీంతో 100 లోపు అలౌట్ చేద్దామని అనుకున్నారు. కానీ ఐర్లాండ్ 140 పరుగులు చేసింది. ఇందులో ఐర్లాండ్ కెప్టెన్ బాల్ బిర్నీ (4), టకర్ (0) ల పరుగులు అందించాడు. ఈ స్థితిలో స్టిర్లింగ్ (11), టెక్టార్ (9) పరుగులు అందించే ప్రయత్నం చేశారు. కానీ భారత్ బౌలర్ ప్రసిద్ధ్ చెలరేగి టెక్టార్, డాక్రెల్ ను ఔట్ చేశాడు.
భారత్ బ్యాటింగ్ లో భాగంగా యశస్వి జైస్వాల్ 24, రుతుజరాజ్ 19 తో శుభారంభం అందించారు. అయితే యశస్వి, తిలక్ వర్మలను యంగ్ ఔట్ చేసి దెబ్బకొట్టారు. భారత్ 6.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 47 పరుగులతో ఉండగా వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్ ను నిలిపివేశారు. వర్షం ఎంతటికీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతితో 2 పరుగుల భారత్ కు అధికంగా ఉండడంతో భారత్ నే విజేతగా అంఫైర్లు ప్రకటించారు. ఎంతో ఉత్కంఠగా సాగిన మొదటి పోరులో భారత్ ఒక దశలో విన్నవుతందా? అనే సందేహాలు నెలకొన్నాయి. కానీ వర్షం రూపంలో ప్లస్ పాయింగ్ అయింది.
దాదాపు 11 నెలల తరువాత ఇంటర్రేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టిన బూమ్రా నేతృత్వంలో మొదటి టీ20 విజేతగా వర్షం రూపంలో విజేతగా నిలిచింది. దీంతో బూమ్రాతో పాటు టీంక కాస్త ఊరట కలిగింది. లేకుండా ఐర్లాండ్ తో మ్యాచ్ అటూ ఇటూ అయితే విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉండేది. ఇప్పటికే వెస్టిండీస్ సిరీస్ కోల్పోవడంతో భారత్ పై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగే రెండో మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత్ కు తసిరీస్ కు దక్కే అవకాశం ఉంది. ఆరోజు కూడా వరుణుడు ఆటంకం సృష్టిస్తాడా? అనేది చూడాలి.