India – Aussie test series : ఇటీవలే ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత పర్యటన ముగిసింది. మరో నాలుగు రోజుల్లో(మార్చి 22 నుంచి) ఐపీఎల్–2024 ప్రారంభం కాబోతోంది. దాదాపు 45 రోజులపాటు ఈ మ్యాచ్‌లు హోరెత్తించనున్నాయి. ఈ నేపథ్యంలో టెస్టు క్రికెట్ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన ఖరారైంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా టూర్‌లో డ్రా, ఓటమి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికపై ప్రభావం చూపనుంది. ఇక కంగారూలను వారి సొంత మైదానంలో ఓడిస్తే వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది.
టీ20 వరల్డ్ కప్ తర్వాత..
ఐపీఎల్ ముగియగానే ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌కప్ జరుగనుంది. ఈ సిరీస్ భారత్‌కు కీలకం. దీనితోపాటే భారత్‌కు మరో పెద్ద సవాల్ ఎదుర్కొనబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న భారత జట్టు ఆస్ట్రేలియా టూర్ నవంబర్‌లో మొదలు కానుంది. ఈ టూర్‌లో ఐదు టెస్టుమ్యాచ్‌లు ఆడుతుంది.
ఐదు వేదికలు రెడీ..
ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు ఆతిథ్య జట్టుతో ఆడే 5 టెస్టు మ్యాచ్‌ల వేదికలు సిద్ధమయ్యాయి. పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతుంది. తర్వాత అడిలైడ్‌లో ఇరు జట్టు డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ఆడతాయి. ఇక మూడో టెస్టు బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరుగుతుంది. గత పర్యటనలో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది. ఈ మైదానంలోనే టీమిండియా హిస్టారికల్ విక్టరీ అందుకుంది. ఇక నాలుగో టెస్టు మెల్‌బోర్న్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 26న జరుగుతుంది. ఐదో టెస్టు సిడ్నీలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌తో న్యూ ఇయర్ 2025లోకి టీమిండియా అడుగు పెడుతుంది. అయితే మ్యాచ్ తేదీలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
రెండు జట్ల గత ప్రదర్శన ఇలా..
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ల తర్వాత అంతటి క్రేజీ ఉండే క్రికెట్ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఈ సిరీస్‌కు మంచి ఆదరణ ఉంటుంది. ఇక గతంలో జరిగిన మ్యాచ్‌లు పరిశీలిస్తే 2018–19లో 4 మ్యాచ్‌ల సిరీస్‌ని 2–1తో భారత్ గెలుచుకుంది. తర్వాత 2020–21లో 4 మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా 2–1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక 2014–15 నుంచి భారత్–ఆస్ట్రేలియా మధ్య 4 టెస్టు సిరీస్‌లు జరిగాయి. నాలుగు టెస్టుల సిరీస్‌లోనూ భారత్ విజయం సాధించింది. అయితే, గతేడాది జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది.
టీమ్ ఇండియాకు కీలక పర్యటన..
ఇక అవన్నీ ఒక ఎత్తు అయితే.. ఈ టూర్ టీమిండియాకు చాలా కీలకం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ఈ టూర్‌లో డ్రా లేదా ఓటమి పాయింట్ల పట్టికపై ప్రభావం చూపుతుంది. అందుకే టీమిండియాకు ఈ సిరీస్ చాలా కీలకం. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియాపై ఆతిథ్య జట్టు ఓడిపోతే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలన్న ఆశలు ఆవిరవుతాఇ. ఓవరాల్‌గా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనలిస్టులను ఈ సిరీస్ నిర్ణయిస్తుంది.