విరాట్ కోహ్లీ మైదానంలో ఏ స్థాయిలో అయితే దూకుడుగా ఉంటాడో.. మైదానం వెలుపల అంతే ప్రశాంతంగా ఉంటాడు. అభిమానులు మాత్రమే కాదు.. ఇతర జట్ల ప్లేయర్లు కూడా ఇష్టపడుతుంటారు.
విరాట్ కోహ్లీని అమితంగా ఇష్టపడే ప్రత్యర్థి జట్ల ప్లేయర్ల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే ఆఫ్గనిస్తాన్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ విపరీతంగా ప్రేమిస్తూ ఉంటారు. విరాట్ కోహ్లీ కూడా అంతే స్థాయిలో వారిని గౌరవిస్తూ ఉంటాడు.
అప్పుడప్పుడు విరాట్ కోహ్లీ తను ధరించిన జెర్సీలను.. బ్యాట్లను ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లకు అందిస్తూ ఉంటాడు. విరాట్ కోహ్లీ అందించిన కానుకలను చూసిన ఆఫ్గనిస్తాన్ ప్లేయర్లు మురిసిపోతూ ఉంటారు.
తాజాగా విరాట్ కోహ్లీ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ గురుబాజ్ కు రెండు బ్యాట్లను కానుకగా పంపించాడు. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో గురుబాజ్ అదరగొట్టాడు. విరోచితమైన బ్యాటింగ్ చేసి.. దక్షిణాఫ్రికా జట్టును కూటమి చివరి అంచు వరకు తీసుకెళ్లాడు. అతని బ్యాటింగ్ ప్రతిభను చూసిన విరాట్ కోహ్లీ ముచ్చటపడ్డాడు.
గురుబాజ్ కు విరాట్ కోహ్లీ విలువైన రెండు బ్యాట్లు పంపించాడు. దీంతో గురుబాజ్ ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ” విరాట్ బాయ్ థాంక్యూ సో మచ్. మీరు ఇచ్చిన కానుక అందింది. మీరు లెజెండ్ క్రికెటర్ మాత్రమే కాదు.. ఇంక చాలా.. మీరు చేసే పనులు అన్ని తరాల వారికి ఆదర్శంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పని స్ఫూర్తిదాయకమని” గురుబాజ్ వ్యాఖ్యానించాడు.
దక్షిణాఫ్రికాపై ఇటీవల టీ20 మ్యాచ్లో గురుబాజ్ అదరగొట్టాడు. ఏకంగా 80 కి పైగా పరుగులు చేసి దక్షిణాఫ్రికా జట్టుకు చుక్కలు చూపించాడు. ఒకవేళ అతడు అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే కచ్చితంగా దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘనిస్తాన్ గెలిచి ఉండేది. అయితే ఈ మ్యాచ్ రెండు సూపర్ ఓవర్లకు దారితీసింది. రెండవ సూపర్ ఓవర్ లో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. టి20 క్రికెట్ చరిత్రలో రెండు సూపర్ ఓవర్లు జరిగిన మ్యాచ్ గా ఇది రికార్డు సృష్టించింది.