IND Vs SA: గుహవాటి టెస్టులో టీమిండియా పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయింది. టీమిండియా పరువు దక్కాలంటే ఈ మ్యాచ్ డ్రా కావాలి. లేదంటే వీరోచిత పోరాటం చేసి మ్యాచ్ గెలిపించుకోవాలి.. ఇవన్నీ జరగాలంటే టీమిండియాలో పోరాట పటిమ కనిపించాలి. గుహవాటిలో తొలి ఇన్నింగ్స్ సాగిన వ్యవహారాన్ని గమనిస్తే టీమ్ ఇండియా ప్లేయర్లు పోరాట పటిమను మర్చిపోయినట్టు కనిపిస్తోంది. ఇలాంటప్పుడే టీం ఇండియా ప్లేయర్లు 2021 -22 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఒకసారి మననం చేసుకుంటే పోరాట పటిమ అంటే ఎలా ఉంటుందో అర్థం అవుతుంది.
2020 – 21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్ళింది.. అడిలైడ్ మైదానంలో తొలి టెస్ట్ జరిగింది. ఈ మ్యాచ్ లో విరాట్ నాయకత్వం వహించాడు. టీమిండియా ఎంత దారుణంగా 36 పరుగులకే ఆల్ అవుట్ అయింది. మ్యాచ్ అనంతరం తనకు కుమారుడు పుట్టడంతో భారత్ తిరిగి వెళ్ళిపోయాడు విరాట్ కోహ్లీ. విరాట్ ఇండియాకు వెళ్లిపోయిన తర్వాత రహానే స్టాండ్ ఇన్ కెప్టెన్ గా వ్యవహరించాడు. మెల్ బోర్న్ మైదానంలో రహానే సెంచరీ సాధించాడు. గాయాలు, ప్లేయర్ల కొరత ఉన్నప్పటికీ రహానే అద్భుతంగా జట్టును ముందుకు నడిపించాడు. ముఖ్యంగా బ్రిస్ బెన్ టెస్టులో అయితే నాడు ఆడిన జట్టులో ప్లేయర్లకు కేవలం 13 టెస్ట్ మ్యాచ్లు అనుభవం మాత్రమే ఉంది. అయినప్పటికీ ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేసి ఆస్ట్రేలియా జట్టును ఓడించారు.. కెప్టెన్లు మారినప్పటికీ.. మైదానాలు మారినప్పటికీ.. ఒత్తిడి విపరీతంగా ఉన్నప్పటికీ చివరికి టెస్ట్ సిరీస్ ను 2-1 తేడాతో టీమిండియా సాధించింది. 32 సంవత్సరాల తర్వాత గబ్బా కోటలో మూడు రంగుల జెండాను ఎగరవేసింది.
గుహవాటి టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో తేలిపోయిన రిషబ్ పంత్ ఒకసారి రహనే పోరాటస్ఫూర్తిని గుర్తుకు తెచ్చుకోవాలి. వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా ప్లేయర్లు పెద్దగా గాయపడలేదు. అనుభవమున్న ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. పైగా స్వదేశంలో ఆడుతున్నారు.. ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ ప్లేయర్లు ఇలా విఫలం కావడం నిజంగా నిర్లక్ష్యానికి బలమైన నిదర్శనం గా కనిపిస్తోంది. ఇప్పటికైనా టీమ్ ఇండియా ప్లేయర్లు ఒళ్ళు వంచుకొని అద్భుతమైన ప్రదర్శన చేస్తే గుహవాటిలో విజయం సాధ్యమవుతుంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మరి దీనిని సాధ్యం చేస్తారా..? ఈ ప్రశ్నకు సమాధానం టీమిండియా ప్లేయర్లే చెప్పాలి.