suryakumar yadav : టీ20లు వచ్చాక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ రూపునే మారిపోయింది. జనాలను బాగా ఎంటర్ టైన్ మెంట్ చేస్తున్న ఈ ఫార్మాట్ రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. బలంగా.. వేగంగా గట్టిగా కొట్టే క్రికెటర్లు ఈ ఫార్మాట్ లో రోజురోజే హీరోలు అయిపోతున్నారు. టెస్ట్ క్రికెట్ కు మసకబారుతున్న వేళ ఈ ఫార్మాట్ లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రస్తుతం పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ వరల్డ్ నంబర్ 1 టీ20 ప్లేయర్ గా ఉన్నాడు. అతడి తర్వాత రెండో స్థానంలో మన మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఈ ఏడాది సూర్య చెలరేగిపోతున్నాడు. ముఖ్యంగా టీ20ల్లో ప్రతాపం చూపిస్తున్నారు. 2022 సంవత్సరంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ తో అత్యధిక పరుగులు చేశాడు. సూర్యకుమార్ ఈ ఏడాది 20 మ్యాచుల్లో 37.88 సగటుతో 82.84 స్ట్రైక్ రేట్ తో 732 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.
ఇక సూర్యకుమార్ తర్వాత నేపాల్ కు చెందిన డీఎస్ అరీ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 18 మ్యాచ్ ల్లో 626 పరుగులు చేశారు. మరోవైపు చెక్ రిపబ్లిక్ కు చెందిన ఎస్.డెవీ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 15 మ్యాచ్ లలో 612 పరుగులు చేశాడు. ఇక పాక్ ఓపెనర్ రిజ్వాన్ 11 మ్యాచ్ లు ఆడి 556 పరుగులు చేసిన 4వ స్థానంలో ఉన్నాడు.
ఇక టీమిండియా క్రికెటర్లలో శిఖర్ ధావన్ 2018 సంవత్సరంలో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధికంగా 689 పరుగులు చేశారు. ఆ తర్వాత కోహ్లీ 641 పరుగులతో మూడోస్థానంలో ఉన్నారు. ఇంతకుముందు శిఖర్ ధావన్ పేరిట ఉన్న ఈ రికార్డును ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ అధిగమించేశాడు.
ఇక ఒక క్యాలెండర్ ఇయర్ లో సూర్యకుమార్ యాదవ్ అత్యధిక సిక్సులు (45) కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2021లో రిజ్వాన్ 42, గప్తిల్ 41 సిక్సర్లు బాదారు. ఇలా పరుగుల్లోనూ.. సిక్సులలోనూ సూర్యకుమార్ ఈ ఏడాది బ్యాట్ తో ఇరగదీశాడనే చెప్పాలి.