IND Vs SA: మనదేశంలో ఎన్నో క్రికెట్ మైదానాలు ఉన్నాయి. ఈ మైదానాలకు చాలా సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే టీమిండియా కు అత్యంత కఠినమైన సవాల్ విసిరిన మైదానాలలో ఈడెన్ గార్డెన్స్ కు విశేషమైన చరిత్ర ఉంటుంది. ఈ మైదానం టీమిండియాకు కొరుకుడు పడని కొయ్య అనుకోవచ్చు. ఈ మైదానం సీటింగ్ కెపాసిటీ పరంగా అత్యంత విశాలమైనది. ఈ మైదానంలో టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుతో శుక్రవారం నుంచి తన తొలి టెస్ట్ ఆడుతోంది.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ 2025 -27 లో ఫైనల్స్ వెళ్లాలంటే కచ్చితంగా ఈ సిరీస్లో టీమిండియా విజయం సాధించాలి. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి కూడా అదే. ఈ రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడడం ఖాయం. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను టీమిండియా సమం చేసింది. వెస్టిండీస్ జట్టుతో జరిగిన సిరీస్ ను వైట్ వాష్ చేసింది. పైగా సొంత దేశంలో ఆడుతోంది కాబట్టి టీమిండియా ఉత్సాహంతో ఉంది.
మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో ఏకంగా ఆస్ట్రేలియా జట్టను ఓడించింది. ఆ తర్వాత పాకిస్తాన్ జట్టును మట్టి కరిపించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో వైవిధ్య భరితమైన ప్లేయర్లు ఉన్నారు. మొత్తంగా పోటీ ఏకపక్షంగా కాకుండా.. హోరాహోరిగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా ఇప్పటివరకు 42 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. ఇందులో 13 మ్యాచ్లలో గెలిచింది. తొమ్మిది మ్యాచ్లో ఓడిపోయింది. మరో 20 మ్యాచ్లను డ్రా చేసుకుంది. చివరిగా 2019లో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది.
డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో దక్షిణాఫ్రికా రంగంలోకి దిగుతోంది. పైగా ఆ జట్టులో డిఫరెంట్ ప్లేయర్లు ఉన్నారు. అందువల్లే ఆ జట్టును తక్కువ అంచనా వేయకుండా ఆడాలని టీమిండియా భావిస్తోంది. అయితే ఈడెన్ గార్డెన్స్ మైదానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎప్పుడు పేస్ బౌలింగ్.. ఎప్పుడు స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తుందో తెలియదు. పైగా బంతి ఊహించిన విధంగా టర్న్ అవుతూ ఉంటుంది. బౌలర్లు బంతిమీద సరైన గ్రిప్ కలిగి ఉంటేనే వికెట్లు తీయడానికి అవకాశం ఉంటుంది. ఓపికతో ఆడిన బ్యాటర్లకు పరుగులు తీయడానికి అవకాశం ఉంటుంది.