Simon Harmer: కోల్ కతా టెస్ట్ లో 90+ పరుగులకే కుప్పకూలింది. గుహవాటి టెస్టులో పరుపు కోల్పోయింది.. అబేద్యమైన టీమిండియా ను ఇలా ఇబ్బంది పెట్టడం వెనక.. జీవం లేని పిచ్ లపై వికెట్లు తీయడం వెనుక ఓ అద్భుతమైన బౌలర్ ఉన్నాడు. అతని పేరు హర్మర్.. ఇంగ్లీషులో హేమర్ అంటే సుత్తి అని అర్థం. సుత్తితో దెబ్బ కొడితే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అటువంటి దెబ్బనే హార్మర్ కొట్టాడు. దక్షిణాఫ్రికా జట్టుకు అద్భుతమైన విజయాన్ని మాత్రమే కాదు.. చరిత్రలో తొలిసారిగా వైట్ వాష్ ఫలితం వచ్చేలా చేశాడు.
స్వదేశంలో ఆడుతున్నప్పటికీ టీమిండియా స్పిన్ బౌలర్లు ప్రభావం చూపించలేకపోయారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్ చేతులెత్తేసిన వేళ.. హార్మర్ మాత్రం అదరగొట్టాడు. జీవం లేని పిచ్ మీద వికెట్ల జాతర కొనసాగించాడు. టీమిండియాతో జరిగిన సిరీస్ లో ఏకంగా 17 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు అంటే అతని బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. 2015లో జాతీయ జట్టులోకి వచ్చిన అతడు.. అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు కేవలం 14 టెస్టులు మాత్రమే ఆడిన అతడు 69 వికెట్లు సాధించాడు. డిఫరెంట్ బౌలింగ్ తో ఆకట్టుకునే హర్మర్ ఎలాంటి పిచ్ పై నైనా బౌలింగ్ చేయగలడు. బంతి నుంచి స్పిన్ రాబట్టగలడు.. అందువల్లే అతడిని దక్షిణాఫ్రికా జట్టు మాయాజాలికుడు అని పిలుస్తుంటారు.
దక్షిణాఫ్రికా జాతీయ జట్టులోకి రాకముందు హర్మర్ అక్కడి డొమెస్టిక్ జట్టులో ఆడాడు. దాదాపు 1015 వికెట్లు పడగొట్టాడు. అతడి ప్రతిభ చూసిన దక్షిణాఫ్రికా మేనేజ్మెంట్ టెస్టుల్లోకి తీసుకుంది. కేవలం 14 టెస్టుల్లో మాత్రమే అతడికి ఆడే అవకాశం కల్పించింది. వచ్చిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకున్న నేపథ్యంలో.. ఇకపై జాతీయ జట్టులో అతడికి పూర్తిస్థాయిలో స్థానం లభిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. అతడి బౌలింగ్ డిఫరెంట్ గా ఉండడం.. ఎటువంటి మైదానంలోనైనా బంతులు వేయగలిగే సామర్థ్యం ఉండడంతో ఇకపై దక్షిణాఫ్రికా జట్టు మేనేజ్మెంట్ అతడిని తన తురుపు ముక్కగా ప్రయోగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు..
“హర్మర్ బౌలింగ్లో ఒక స్టెయిన్ కనిపిస్తున్నాడు.. స్పిన్ బౌలింగ్ వేసే బౌలర్ బంతిని ఇన్ని విధాలుగా తిప్పడం అంత ఈజీ కాదు. ఇది కూడా ఫారిన్ పిచ్ మీద ఇలా బంతులు వేయడం అంత సులభం కాదు. అతడి చేతిలో ఏదో మాయాజాలం ఉంది. అందువల్లే ఇండియన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. చూస్తుండగానే పేవిలియన్ క్యూ కట్టారు. ఇకపై హర్మర్ దక్షిణాఫ్రికా జట్టులో పూర్తిస్థాయిలో సభ్యుడవుతాడు. అన్నిటికి మించి వజ్రాయుధం లాగా ఆ జట్టుకు ఉపయోగపడతాడని” క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.