IND vs NZ T20 : భారత్ వర్సెస్ న్యూజిలాండ్: మొదటి టీ20లో విజయం ఎవరిదంటే

IND vs NZ T20 : ఈ ఏడాది ఆరంభమే ఘనంగా ప్రారంభం కావడంతో.. టీమిండియా రెచ్చిపోతుంది.. ఇదే ఊపులో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను వైట్ వాష్ చేసింది.. ఈ క్రమంలో శుక్రవారం నుంచి అదే జట్టుతో మూడు టి20 సిరీస్ ప్రారంభం కానుంది.. వన్డే సిరీస్ లో ఆడిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కోహ్లీ ఈ సిరీస్ కు దూరంగా ఉన్నారు.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు […]

Written By: NARESH, Updated On : January 26, 2023 10:07 pm
Follow us on

IND vs NZ T20 : ఈ ఏడాది ఆరంభమే ఘనంగా ప్రారంభం కావడంతో.. టీమిండియా రెచ్చిపోతుంది.. ఇదే ఊపులో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను వైట్ వాష్ చేసింది.. ఈ క్రమంలో శుక్రవారం నుంచి అదే జట్టుతో మూడు టి20 సిరీస్ ప్రారంభం కానుంది.. వన్డే సిరీస్ లో ఆడిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, కోహ్లీ ఈ సిరీస్ కు దూరంగా ఉన్నారు.. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటాడు..

వరుసగా సెంచరీలు బాది భీకరమైన ఫామ్ లో ఉన్న శుభ్ మన్ గిల్ , రంజీ ల్లో త్రిబుల్ సెంచరీ సాధించి జోరు మీద ఉన్న పృథ్వి షా… ఓపెనర్లుగా బర్లోకి దిగనున్నారు.. ఇక వన్డే సిరీస్ లో నిరాశపరచిన సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ రాణించాలని అభిమానులు కోరుతున్నారు.. ఇక మూడో వన్డేలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ పాండ్యా… టి20 లో కూడా అదే ఆట తీరు కొనసాగించాల్సిన అవసరం ఉంది.. ఇక మిడిల్ ఆర్డర్లో రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ మధ్య పోటీ ఉన్నది. వీరిలో ప్లేయింగ్ ఎలెవన్ జట్టులో ఇద్దరికీ మాత్రమే అవకాశం లభించనుంది.

బౌలింగ్ విషయానికి వస్తే మాలిక్, ఆర్ష్ దీప్ సింగ్ కు చోటు లభించడం ఖాయం.మావి, ముఖేష్ కుమార్ లో ఒకరిని మూడో పేసర్ గా తీసుకోవచ్చు.. కులదీప్ యాదవ్, చాహల్ మధ్య పోటీ ఉండగా… నిలకడగా వికెట్లు పడగొడుతున్న యాదవ్ వైపే జట్టు యాజమాన్యం మొగుచూపొచ్చు.. ఇక తొలి వన్డే రాంచీలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి జరగనుంది.. రెండో మ్యాచ్ ఆదివారం రాత్రి 7 గంటల నుంచి లక్నోలో జరగనుంది.. మూడో మ్యాచ్ ఫిబ్రవరి 1 న రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ మధ్య 22 మ్యాచ్ లు జరిగాయి.. వీటిల్లో 12 మ్యాచ్ లను భారత్ గెలిచింది.. కివీస్ 9 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు.

జట్ల అంచనా ఇలా

భారత్;

గిల్, పృథ్వీ షా, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ సింగ్, మాలిక్, మావి, కులదీప్ యాదవ్.

న్యూజిలాండ్

శాంటర్న్, అలెన్, బ్రేస్ వెల్, కాన్వే, ఫెర్గూ సన్, మిచెల్, ఫిలిప్, షిష్లే, ఇష్ సోది, టిక్నర్.