Homeక్రీడలుక్రికెట్‌IND Vs NZ Final Controversy Pakistan Cricketers Comments: టీమిండియా పై ఇంత...

IND Vs NZ Final Controversy Pakistan Cricketers Comments: టీమిండియా పై ఇంత ద్వేషమా? పాకిస్తాన్ క్రికెటర్లకు పిచ్చి లేచినట్టుంది..

IND Vs NZ Final Controversy Pakistan Cricketers Comments: ఆటను ఆట మాదిరిగానే చూడాలి. గెలిస్తే గర్వం రాకూడదు. ఓడిపోతే విచారం మిగలకూడదు. ఎలాంటి స్థితిలో ఆడినప్పటికీ క్రీడా స్ఫూర్తిని మర్చిపోకూడదు. టీమిండియా క్రికెటర్లు దీన్ని కొనసాగిస్తున్నారు కాబట్టే.. ప్రపంచ క్రికెట్లో బిసిసిఐ పెత్తనం సాగుతోంది. పోరాట స్ఫూర్తిని మన క్రీడాకారులు ప్రతి సందర్భంలో నిరూపిస్తున్నారు కాబట్టి.. టీమిండియా ఈ స్థాయిలో ఉంది.

Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!

టీమిండియా పై ఆది నుంచి కూడా పాకిస్తాన్ దేశానికి, పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు, ఆ జట్టులో ఆడే ఆటగాళ్లకు ద్వేషమే. అందువల్లే నిత్యం తిట్టిపోస్తూ ఉంటారు. టీమిండియా వరుసగా రెండవసారి t20 వరల్డ్ కప్ ఫైనల్ లోకి రావడానికి పాకిస్తాన్ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్లే తమ ద్వేషాన్ని రకరకాలుగా ప్రదర్శిస్తున్నారు. ఆదివారం న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తమ విద్వేష బుద్ధిని మరోసారి నిరూపించుకున్నారు.

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజ మామూల్ హక్ తన వక్రబుద్ధిని బయట పెట్టుకున్నాడు. మ్యాచ్ ముందు పిచ్ ఫోటోను తీసుకోవాలని.. అనుక్షణం దానిని పరిశీలిస్తూ ఉండాలని న్యూజిలాండ్ క్రికెట్లకు సూచించాడు. ఇక షాహిద్ ఆఫ్రిది అయితే నెత్తి మాసిన మాటలు మాట్లాడాడు. ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గనుక గెలిస్తే క్రికెట్ మొత్తం సంకనాకి పోతుందని పిచ్చి వ్యాఖ్యలు చేశాడు. ఇక తన్విర్ అహ్మద్ అనే ఆటగాడు అయితే ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా గెలిస్తే తాను బట్టలు లేకుండా పాకిస్తాన్ మొత్తం తిరుగుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ 33 బంతుల్లోనే సెంచరీ చేస్తాడని జోష్యం చెప్పాడు.

టీమిండియా ఫైనల్ వెళ్ళగానే పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తమ వక్ర బుద్ధిని నిరూపించుకుంటున్నారు. ప్రొఫెషనల్ క్రికెటర్లు అనే విషయాన్ని మర్చిపోయి పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి సో కాల్డ్ రాజకీయ నాయకులు ఏదేదో మాట్లాడుతుంటారు. కానీ క్రికెటర్లకు విచక్షణ అనేది ఉండాలి. దానిని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మర్చిపోవడం.. పొలిటికల్ లీడర్ కంటే దారుణంగా వ్యాఖ్యలు చేయడం వారి లేకి బుద్ధిని సూచిస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version