IND Vs NZ Abhishek Sharma: టి20 ఫార్మాట్ లో అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలోకి దిగడమే ఆలస్యం.. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. ఎటువంటి పిచ్ అయినా సరే వీరోచితంగా పరుగులు తీస్తూ ఉంటాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా ఫోర్లు.. జెర్సీ వేసుకున్నంత సులభంగా సిక్సర్లు కొడుతుంటాడు. అందువల్లే అతనిని అభి సిక్స్ శర్మ అని పిలుస్తుంటారు.
బుధవారం నాగ్ పూర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తొలి టి20 ఆడింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు టీమ్ ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ క్రమంలో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ (84) వెంట్రుక వాసిలో సెంచరీ కోల్పోయాడు. 35 బంతుల్లో అతడు 5 ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సహాయంతో 84 పరుగులు చేశాడు. సంజు శాంసన్(10), ఇషాన్ కిషన్(8) వంటి వారు విఫలమైనప్పటికీ.. సూర్య కుమార్ యాదవ్ (32) సహాయంతో టీమిండియా స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించాడు. సూర్య కుమార్ యాదవ్, అభిషేక్ శర్మ మూడో వికెట్ కు ఏకంగా 99 పరుగులు జోడించారు. తద్వారా టీమిండియా పటిష్ట స్థితికి చేరుకుంది. సూర్య కుమార్ యాదవ్ అవుటైన తర్వాత.. అభిషేక్ శర్మ 84 పరుగులు చేసి జామిషన్ బౌలింగ్లో అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన శివం దుబే (8) కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత రింకు సింగ్ (44*), హార్దిక్ పాండ్యా (25) సత్తా చూపించారు. ద్వారా టీం ఇండియా స్కోర్ పరుగులు పెట్టింది. ఒకవేళ హార్దిక్ పాండ్యా ఔట్ అవ్వకుండా ఉండి ఉంటే టీమ్ ఇండియా స్కోర్ మరిత ఎక్కువగా ఉండేది. హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత.. రంగంలోకి వచ్చిన అక్షర్ పటేల్ (5) అంతగా ఆకట్టుకోలేకపోయాడు.ఈ నేపథ్యంలో టీమిండియా ఇన్నింగ్స్ 238 పరుగుల వద్ద ముగిసింది. టీమిండియా ఈ స్థాయిలో స్టోర్ చేసిందంటే దానికి ప్రధాన కారణం అభిషేక్ శర్మ. నాగ్ పూర్ మైదానం బ్యాటింగ్ కు అంతగా అనుకూలించకపోయినప్పటికీ.. డ్యూ లేకపోయినప్పటికీ.. దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.. ఈ ఒక్క బౌలర్ పై కనికరం లేకుండా దూకుడుగా ఆడాడు. అందువల్లే టీమిండియా ఈ స్థాయిలో భారీ స్కోర్ చేయగలిగింది.
అభిషేక్ శర్మను అవుట్ చేయడానికి న్యూజిలాండ్ కెప్టెన్ ఎంతోమంది బౌలర్లను మార్చాడు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఒకానొక దశలో అభిషేక్ శర్మ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అతడు కొట్టిన షాట్ క్లిక్ కాకపోవడంతో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఒకవేళ గనుక అతడు అలానే ఉండి ఉంటే కచ్చితంగా సెంచరీ చేసేవాడు. ఇండియా స్కోర్ ను 250 కి మించి ఉండేలా చేసేవాడు. ఏది ఏమైనప్పటికీ టికెట్ కొనుగోలు చేసి మైదానంలోకి వచ్చిన ప్రేక్షకులకు పైసా వసూల్ అనుభూతిని అందించాడు అభిషేక్ శర్మ.
Abhishek Sharma – The Destroyer
1st ball: Dot
2nd ball: Dot
3rd ball: Dot
Then he asks the NZ bowler — ‘Do you know who I am?’
4th ball: SIX! pic.twitter.com/rkEwsauacN— MuFFatLal Bohra (@arshdeep3444) January 21, 2026