Ind Vs NZ 1st T20 Jacob Duffy: టి20లో ఎప్పుడో ఒకసారి బౌలర్లకు అద్భుతమైన ప్రదర్శన చేసే అవకాశం కలుగుతుంది. మిగతా అన్ని సందర్భాలలో బ్యాటర్ల ప్యారడైజ్ కొనసాగుతూ ఉంటుంది. బుధవారం నాగ్ పూర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టి20 మ్యాచ్లో టీం ఇండియా అదరగొట్టింది. 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 84 పరుగులు చేసి అదరగొట్టాడు. సూర్య కుమార్ యాదవ్ 32, రింకు సింగ్ 44* పరుగులతో విధ్వంసాన్ని సృష్టించారు.
టీమిండియా బ్యాటర్ల దూకుడుకు అటుకట్ట వేయడానికి న్యూజిలాండ్ కెప్టెన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏకంగా ఆరుగురు బౌలర్లను అతడు రంగంలోకి దింపాడు. కానీ, ఒక్క బౌలర్ మాత్రమే టీమిండియా బ్యాటర్లకు అడ్డుకట్ట వేయగలిగాడు. పరుగుల వరద పారకుండా చూడగలిగాడు. అతని పేరే జాకబ్ డపీ. ఇతడేకంగా నాలుగు ఓవర్లు వేశాడు. కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రెండు కీలకమైన వికెట్లను పడగొట్టాడు. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యాను ఇతడు అవుట్ చేశాడు. ఒకవేళ కిషన్, పాండ్యా కనుక క్రీజులో ఉండి ఉంటే టీమ్ ఇండియా స్కోర్ మరింత పెరిగేది.
పరుగుల వరద పారుతున్న మైదానంలో ఆ స్థాయిలో బౌలింగ్ వేయడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్ తో డఫీ బంతులు వేశాడు. డఫీ ని ఐపీఎల్ లో బెంగళూరు జట్టు సొంతం చేసుకుంది. ఇతడిని రెండు కోట్లకు దక్కించుకుంది.. భారత జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా డఫి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేసిన నేపథ్యంలో.. బెంగళూరు యాజమాన్యం అమితమైన ఆనందంతో ఉంది.. ఇప్పటికే బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్, కృణాల్ పాండ్యా వంటి బౌలర్లు ఉన్నారు. గత ఏడాది ఐపిఎల్ లో బెంగళూరు విజేతగా నిలవడంలో వీరు తీవ్రంగా కృషి చేశారు. ఇప్పుడు వీరికి డఫి కూడా తోడైతే బెంగళూరు జట్టుకు తిరుగు ఉండదు.