Homeక్రీడలుక్రికెట్‌IND Vs ENG: రాహులా? పంతా? వికెట్ కీపర్ అయ్యేది ఎవరు? మేనేజ్మెంట్ ఎవరి...

IND Vs ENG: రాహులా? పంతా? వికెట్ కీపర్ అయ్యేది ఎవరు? మేనేజ్మెంట్ ఎవరి వైపు మొగ్గుతుందో?

IND Vs ENG: నాగ్ పూర్(Nagpur) వేదికగా ఇంగ్లాండ్ – భారత్ తలపడుతున్నాయి. ఈ వేదిక పై దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత వన్డే మ్యాచ్ జరుగుతున్నది.. ఈ మైదానం స్పిన్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో పేస్ బౌలర్లు కూడా సత్తా చాటే అవకాశాన్ని కొట్టిపారేయలేమని క్యూరేటర్ అంటున్నారు.. మరోవైపు ఈ మైదానంపై సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 288 పరుగులుగా నమోదవుతుందని, టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

రూట్ వచ్చేసాడు

ఇక టి20 సిరీస్లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయింది. అయితే వన్డే సిరీస్లో సత్తా చాటాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తోంది. దాదాపు 14 నెలల తర్వాత ఇంగ్లాండ్ జట్టులోకి జో రూట్ ( Joe root) వచ్చేసాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ బలోపేతమైనటు కనిపిస్తోంది. రూట్ మినహా టి20 లు ఆడిన ఆటగాళ్లతోనే ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కూడా ఆడిస్తోంది.. బట్లర్ (butler), లివింగ్ స్టోన్ ( living stone), హ్యారీ బ్రూక్ (Harry brook) సత్తా చాటితే ఇంగ్లాండ్ చెట్టుకు తిరిగి ఉండదు. షకీబ్ మహమ్మద్ పేస్ బౌలర్ గా తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

వికెట్ కీపర్ ఎవరో?

నాగపూర్ మ్యాచ్లో టీమిండియా కు వికెట్ కీపర్ గా ఎవరు వ్యవహరిస్తారనేది ఉత్కంఠ గా మారింది. కేఎల్ రాహుల్ (KL Rahul), రిషబ్ పంత్ (Rishabh pant)లలో ఎవరికి చోటు దక్కుతుందో అంతు పట్టకుండా ఉంది.. కెప్టెన్ రోహిత్ శర్మ(captain Rohit Sharma), శుభ్ మన్ గిల్ (Shubh Man Gil) ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తర్వాత బ్యాటింగ్ వికెట్ కీపర్ వస్తారు. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ లో రాహుల్ వికెట్ కీపర్ గా వ్యవహరించాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గానూ ఆకట్టుకున్నాడు. అయితే ఎడమ చేతి వాటం బ్యాటింగ్ చేసే రిషబ్ పంత్.. వైవిధ్యంగా ఆడతాడు. దూకుడుగా పరుగులు చేస్తాడు. అతడు జట్టుకు అదనపు బలంగా మారతాడని స్పోర్ట్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ రాహుల్, పంత్ కు అవకాశాలు లభిస్తే శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) రిజర్వ్ బెంచుకు పరిమితమయ్యే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ తర్వాత తొలిసారి వన్డే ఆడుతున్నాడు. సుదీర్ఘకాలం గాయాల నుంచి కోలుకొని.. మహమ్మద్ షమీ జట్టులోకి అడుగు పెట్టాడు.. కులదీప్ యాదవ్ సామర్థ్యాన్ని కూడా ఈ సిరీస్ లో సెలెక్టర్లు జాగ్రత్తగా పరిశీలించే అవకాశం ఉంది. కులదీప్ చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చాడు. సిరాజ్, బుమ్రా లేకపోవడంతో అర్ష్ దీప్ సింగ్ పైనే ఎక్కువ భారం పడుతుందని తెలుస్తోంది. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా లో ఇద్దరికి మాత్రమే ఆడే అవకాశం ఉంది. మరోవైపు వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసినప్పటికీ అతనిని ఆడించే అవకాశాలు అంతగా ఉండవని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular