India Vs England 2nd T20: చెన్నై వేదికగా జరిగిన రెండవ టి20 లో భారత్ ఎదుట ఇంగ్లాండ్ ఒక మోస్తారు లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది.. అయితే దీనిని చేదించడంలో భారత్ ఇబ్బంది పడింది. ఒకానొక దశలో వికెట్లు పడిపోతున్నప్పటికీ.. తిలక్ వర్మ ఒంటి చేత్తో భారత జట్టుకు విజయాన్ని అందించాడు. ఒకానొక దశలో భారత్ గెలవడం కష్టమని అందరికీ అనిపించింది. దీనికి ఒత్తిడి కూడా తోడైంది. ఆ దశలో ధైర్యంగా నిలబడ్డాడు తిలక్ వర్మ. దీంతో భారత్ చివరి ఓవర్ లో విజయం సాధించింది. వికెట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. అయితే గెలుపునకు దగ్గరగా వచ్చిన ఇంగ్లాండ్ జట్టు చివర్లో చేతులెత్తేసింది. దీంతో వరుసగా రెండవ ఓటమిని మూటగట్టుకుంది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది.. బట్లర్ 45, కార్స్ 31, జెమీ స్మిత్ 22 పరుగులతో ఆకట్టుకున్నారు. అక్షర్, వరుణ్ చెరి 2 వికెట్లు దక్కించుకున్నారు.. ఈ టార్గెట్ ను చేజ్ చేయడానికి భారత్ 19.2 ఓవర్ల పాటు ఆడాల్సి వచ్చింది. 8 వికెట్ల కోల్పోయి 166 పరుగులు చేసింది. సుందర్ (22) పరుగులతో ఆకట్టుకున్నాడు. కార్స్ మూడు వికెట్ల సొంతం చేసుకున్నాడు. తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది పురస్కారం దక్కింది. ఈ సిరీస్ లో మూడవ టి20 రాజ్ కోట్ లో మంగళవారం జరుగుతుంది.
నిలబడ్డాడు
భారత జట్టు ఎదుట ఇంగ్లాండ్ విధించిన లక్ష్యం పెద్దది కాకపోయినప్పటికీ.. భారత్ మధ్య ఓవర్లలో తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ క్రమంలో తిలక్ వర్మ దూకుడు అయిన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొలి ఓవర్ లో అభిషేక్ శర్మ (12) మూడు ఫోర్లు కొట్టి సౌకర్యవంతంగా కనిపించినప్పటికీ.. ఆ తర్వాత అభిషేక్, సంజు శాంసన్ (5) ఔట్ అయ్యారు. సూర్య కుమార్ యాదవ్ (12) తీవ్రంగా నిరాశపరచాడు.. తొలి మ్యాచ్ మాదిరిగానే దారుణంగా ఆడాడు..ఓ ఎండ్ లో వికెట్లు పడుతున్నప్పటికీ తిలక్ వర్మ ఏమాత్రం రాజీ పడలేదు. ప్రారంభం నుంచి దూకుడు కొనసాగించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు.. 5 ఓవర్ లో 4, 6, 6 కొట్టి తన సత్తా ఏమిటో చూపించాడు.. చివరి ఓవర్ వరకు గట్టిగా నిలబడ్డాడు. పవర్ ప్లే లో టీం ఇండియా వికెట్లను భారీగా కోల్పోయినప్పుడు తిలక్ కాస్త నిశ్శబ్దాన్ని ప్రదర్శించాడు. ఆ తర్వాత సుందర్ 13 వ ఓవర్లో 6, 4, 6 కొట్టడంతో భారత్ స్కోర్ కాస్త గాడిలో పడింది. ఈ దశలో అక్షర్ పటేల్, సుందర్ (2) అవుట్ కావడంతో.. ఇంగ్లాండ్ ఓడిపోయేలా కనిపించింది. అప్పటికి భారతదేశంలో కేవలం 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ దశలో 5 ఓవర్లలో భారత్ గెలవాలంటే 40 పరుగులు కావాలి. దీంతో తిలక్ 16 ఓవర్లో 6,6,4 పరుగులతో ఆకట్టుకోవడంతో ఒక్కసారిగా మ్యాచ్ భారత వైపు టర్న్ అయింది.. దీనికి తోడు భారత విజయ సమీకరణం 12 బంతులకు 13 పరుగులకు చేరుకున్నప్పుడు రవి బిష్ణోయ్(9*) పరుగులు చేయడంతో భారత్ పై ఒత్తిడి తగ్గింది. ఈ దశలో చివరి ఓవర్ లో తిలక్ 2, 4 కొట్టడంతో భారత్ గెలిచింది.