IND vs AUS Kuldeep yadav Spri : అప్పట్లో షేన్ వార్న్ తిప్పితే బ్యాట్స్ మెన్ అవాక్కయ్యే వారు. దీనిపై ‘అవాక్కయ్యారా’ అంటూ ప్రకటనలు వచ్చేవి. అంతలా స్పిన్ తో షేన్ వార్న్ ఓ దశాబ్ధం పాటు ఊపు ఊపాడు.ఇప్పుడు మొదట్లో స్పీడందుకొని తర్వాత చల్లబడి ఇప్పుడు వేగం పెంచి మన లెఫ్మార్మ్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ కూడా ఓ రేంజ్ లో బంతిని తిప్పేస్తున్నాడు. అతడి వేగవంతమైన స్పిన్ కు బ్యాట్స్ మెన్ బెంబేలు అవుతున్న పరిస్థితి నెలకొంది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన మూడో వన్డేలో టీమిండియా బౌలర్లు పద్ధతిగానే బౌలింగ్ చేసినా ఆస్ట్రేలియాను తక్కువకు కట్టడి చేయలేకపోయారు. మధ్యలో వికెట్లు పడిపోయి 200లోపే ఆలౌట్ అవుతుందని అనుకున్నా చివరి వరుస బ్యాట్స్ మెన్ పోరాడడంతో స్కోరు వచ్చిపడింది.
అయితే ఇందులో కులదీప్ యాదవ్ తన బౌలింగ్ తో అదరగొట్టాడు. ముఖ్యంగా వేగవంతమైన లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ తో కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. డేంజర్ బ్యాట్స్ మెన్ వార్నర్ తోపాటు లబుషేన్, అలెక్స్ క్యారీ లాంటి టాప్ బ్యాట్స్ మెన్ ను ఔట్ చేశాడు.
ఇందులో కీపర్ అలెక్స్ క్యారీ ఔట్ హైలెట్ అని చెప్పొచ్చు. లెఫ్ట్ సైడ్ పడి బంతి రైట్ సైడ్ తిరుగుతూ వదిలేసిన అలెక్స్ క్యారీని ఆశ్చర్యపరిచింది. నేరుగా బంతి గింగిరాలు తిరుగుతూ ఊహించని విధంగా వికెట్లను గిరాటేసింది.
అప్పట్లో షేన్ వార్న్ బంతులు ఇలానే అందరినీ ఆశ్చర్యపరిచేవి. ఈరోజు కులదీప్ యాదవ్ సైతం అదే రీతిలో తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించారు. 270 పరుగులతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్, గిల్ ధాటిగా ఆడడంతో నిలబడింది. ప్రస్తుతం 25 ఓవర్లకు 123 పరుగులతో ఆడుతోంది. మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ నిలబడితే గెలుపు లాంఛనమే. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.
https://twitter.com/BCCI/status/1638501745486884865?s=20