Ind Vs Aus 4th Test: ఇదేం అడ్డి మారి గుడి దెబ్బ కాదు. ఏదో దొడ్డి దారిన వచ్చి కొట్టిన ఇన్నింగ్స్ అంతకన్నా కాదు. కష్టాన్ని నమ్ముకుని.. కన్నీళ్లను దిగమింగుకొని.. జట్టులో స్థానం సంపాదించి.. దానిని సుస్థిరం చేసుకునేందుకు ఆడిన ఇన్నింగ్స్.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబెట్టడానికి ఆడిన ఇన్నింగ్స్.. ధైర్యాన్ని కూడ తీసుకొని జట్టును నిలబెట్టిన ఇన్నింగ్స్.. అందువల్లే నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పుష్ప మేనరిజాన్ని ప్రదర్శించాడు.. సెంచరీ చేసిన తర్వాత మెల్బోర్న్ మైదానంలో జెండా పాతాడు. 221/7 వద్ద ఉన్న జట్టును 358/9 దాకా తీసుకెళ్లాడంటే.. అతడు ఏ స్టైల్ లో బ్యాటింగ్ చేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. అతడు ఏ స్థాయిలో ఆడేందుకు ప్రిపేర్ అయ్యాడో అవగతం చేసుకోవచ్చు. స్టార్క్ బౌలింగ్ లో అదరగొట్టాడు. బోలాండ్ ను బెదరగొట్టాడు.. కమిన్స్ ను ప్రతిఘటించాడు. లయన్ కు చుక్కలు చూపించాడు.. హెడ్ కు తలనొప్పి తెప్పించాడు.. మార్ష్ కు మెంటల్ ఎక్కించాడు. ఇలా ఆడాడు కాబట్టే.. మూడోరోజు ఆస్ట్రేలియా పప్పులు మెల్బోర్న్ మైదానంలో ఉడకలేదు..
సెంచరీ చేసిన తర్వాత..
మెల్బోర్న్ మైదానంలో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత పుష్ప స్టైల్ లో మేనరీజాన్ని ప్రదర్శించాడు నితీష్ కుమార్ రెడ్డి. తగ్గేది లేదు అన్నట్టుగా హావ భావాలను ప్రదర్శించాడు. ఇక సెంచరీ చేసిన తర్వాత మరింత వేగంతో దూసుకొచ్చాడు. తన తలకు ఉన్న హెల్మెట్ తీసి.. దానిని బ్యాట్ హ్యాండిల్ పైన ఉంచి.. మెల్బోర్న్ మైదానంలో భారతీయ జెండా పాతాం అన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు. ఇది సగటు భారతీయ అభిమానికి గర్వంగా అనిపించింది. కష్టాల్లో ఉన్నప్పుడు.. ధైర్యంగా పైకి ఎదిగి.. నిలబడ్డామని సంకేతాలు ఇచ్చింది. అందువల్లే నితీష్ కుమార్ రెడ్డి చూపించిన ఈ తెగువ ప్రతి అభిమానికి ఆనందాన్ని కలిగిస్తోంది. అందువల్లే ఆ చిత్రం సామాజిక మాధ్యమాలలో హైలైట్ గా నిలిచింది.. నితీష్ కుమార్ రెడ్డి చేసిన సెంచరీ వల్ల భారత్ గౌరవప్రదమైన స్థాయిని దాటింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా కంటే 116 పరుగులు వెనుకబడి ఉంది. ఒకవేళ నాలుగు రోజు గనుక ఇదే స్థాయిలో నితీష్ అద్భుతం చేస్తే భారత జట్టుకు ఇక తిరుగు ఉండదు.బుమ్రా హ్యాండ్ ఇచ్చినట్టు కాకుండా సిరాజ్ కనక జిడ్డు ఆటను ప్రదర్శిస్తే.. నితీష్ కు బ్యాటింగ్ చేసే అవకాశం ఎక్కువగా లభిస్తుంది. అప్పుడు అతడు స్వేచ్ఛగా పరుగులు తీయవచ్చు. ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని మరింతగా తగ్గించవచ్చు. అప్పుడు మెల్బోర్న్ టెస్ట్ మన చేతిలోకి వస్తుంది.
The rising ⭐ of Indian cricket shines bright in the Boxing Day Test with a maiden Test hundred!
Take a bow, #NitishKumarReddy! #AUSvINDOnStar 4th Test, Day 3 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/xsKac0iCju
— Star Sports (@StarSportsIndia) December 28, 2024