Homeక్రీడలుక్రికెట్‌Ind Vs Aus 4th Test: నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసిన తర్వాత.. అతడి...

Ind Vs Aus 4th Test: నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసిన తర్వాత.. అతడి తండ్రి హావ భావాలు చూశారా.. గుండె తడిని తట్టి లేపే దృశ్యం అది..

Ind Vs Aus 4th Test: నితీష్ కుమార్ రెడ్డి స్వస్థలం విశాఖపట్నం. అతడి తండ్రి పేరు ముత్యాల రెడ్డి. హిందుస్థాన్ జింక్ లో పనిచేసేవారు. నితీష్ కుమార్ రెడ్డికి చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉండేది. అయితే అతడి ఇష్టాన్ని గుర్తించిన ముత్యాల రెడ్డి ప్రోత్సహించారు. రంజి టోర్నీ లోను నితీష్ రెడ్డి అదరగొడుతున్న నేపథ్యంలో.. 25 సంవత్సరాల కంటే ముందుగానే తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీలో నితీష్ కుమార్ రెడ్డిని చేర్పించారు. నితీష్ కుమార్ రెడ్డిని క్రికెట్ అకాడమీలో చేర్పించారు. అలా అనేక కష్టాలు ఎదుర్కొంటూ.. ఆర్థిక ఇబ్బందులను చవిచూస్తూ.. నితీష్ కుమార్ రెడ్డిని గొప్ప క్రికెటర్ గా తీర్చిదిద్దారు. జాతీయ జట్టులో నితీష్ కుమార్ రెడ్డికి స్థానం రావడంతో ముత్యాల రెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు తరఫున నితీష్ కుమార్ రెడ్డి అదరగొట్టడంతో ముత్యాల రెడ్డి వేడుకలు జరుపుకున్నారు. అయితే టెస్ట్ జట్టులో నితీష్ రెడ్డికి చోటు లభించడం.. అతడు మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో సెంచరీ చేయడాన్ని ముత్యాల రెడ్డి గొప్పగా భావిస్తున్నారు. మైదానంలో ఒక ప్రేక్షకుడిగా ఆ మ్యాచ్ చూసి.. తన కుమారుడు సెంచరీ చేయడాన్ని దగ్గరగా చూసి భావోద్వేగానికి గురయ్యారు. ముత్యాల రెడ్డి కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారాయి.

సెంచరీకి చేరువగా వచ్చినప్పుడు..

నితీష్ కుమార్ రెడ్డి మెల్బోర్న్ స్టార్క్ బౌలింగ్ లో సూపర్ ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ చేయడాన్ని ముత్యాల రెడ్డి అద్భుతంగా ఆస్వాదించారు. తన కుమారుడు పుష్ప రేంజ్ ఎలివేషన్ ఇవ్వడంతో మురిసిపోయారు. ఇదే సమయంలో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీకి చేరుగా రావడంతో ముత్యాల రెడ్డి లో ఉత్కంఠ పెరిగిపోయింది.. 99 పరుగులకు దగ్గరగా వచ్చినప్పుడు వాషింగ్టన్ సుందర్ అవుట్ కావడం.. ఆ తర్వాత వచ్చిన బుమ్రా కూడా పెవిలియన్ చేరుకోవడంతో ముత్యాల రెడ్డిలో ఆందోళన పెరిగిపోయింది. తన కుమారుడు సెంచరీ చేస్తాడా? చేసే అవకాశం లభించదా? అనే ప్రశ్నలు అతడి మదిని తొలవడం మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో క్రీజ్ లోకి వచ్చిన సిరాజ్ కమిన్స్ వేసిన మూడు బంతులను విజయవంతంగా ఆడాడు. దీంతో బ్యాటింగ్ చేసే అవకాశం నితీష్ కుమార్ రెడ్డికి లభించింది.. దీంతో వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. సూపర్ సెంచరీ చేసి అదరగొట్టాడు.. నితీష్ సెంచరీ చేయడంతో ముత్యాల రెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతడు ఆకాశం కేసి వెళ్లి చూస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. ” 25 సంవత్సరాలు తన ఉద్యోగ జీవితం ఉండగానే కుమారుడి కోసం రాజీనామా చేశాడు. ప్రఖ్యాత హిందుస్థాన్ జింక్ లో ఉద్యోగాన్ని వదులుకున్నాడు. కుమారుడిని ఎమ్మెస్కే ప్రసాద్ అకాడమీలో చేర్పించాడు. ఆర్థిక కష్టాలు.. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కుమారుడిని ఇంత వాడిని చేశాడు. అతడు ఆస్ట్రేలియా మైదానంపై చెలరేగిపోతుంటే గర్వంగా చూస్తున్నాడు. ఒక తండ్రికి ఇంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది. ఇంతకు మించిన గొప్పతనం మరొకటి ఏముంటుంది” అని జాతీయ మీడియా ముత్యాల రెడ్డిని ప్రశంసిస్తోంది.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular