IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టులో భారీ విజయం సాధించిన తర్వాత టీమిండియా వైట్ బాల్ ఫార్మాట్ కు సిద్ధమైంది. 2027 వన్డే వరల్డ్ కప్ కు ఈ టోర్నీని టీమిండియా సన్నాహకంగా భావిస్తుంది. ఇందులో భాగంగా ధర్మశాల వేదికగా జరిగే తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ తో పోటీ పడబోతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆడటం లేదు.
విరాట్ కోహ్లీ జట్టులో లేకపోతే అది కాస్త ఇబ్బందే. అతడి గాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగే సిరీస్ కు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో ఎవరు ఆడతారు అనే చర్చ మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలన ప్రదర్శన చేస్తుంది. గతంలో ఈ జట్టుకు ఆస్ట్రేలియాను.. దక్షిణాఫ్రికా ను ఓడించిన చరిత్ర ఉంది. అలాంటప్పుడు ఈ జట్టును అంత తేలికగా టీం ఇండియా మేనేజ్మెంట్ తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ స్థానంలో ఇషాన్ కిషన్.. కేఎల్ రాహుల్.. జైస్వాల్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఐపీఎల్లో పై ముగ్గురు సూపర్ ఆట తీరుతో ఆకట్టుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఏకంగా సెంచరీ కూడా చేశాడు. కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కిషన్ కూడా అదరగొడుతున్నాడు.. అయితే టెస్టులో మాత్రం జైస్వాల్ తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేక పోయాడు.
బహుశా జైస్వాల్ కు విశ్రాంతి ఇచ్చి కే ఎల్ రాహుల్ లేదా కిషన్ కు జట్టులో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే కిషన్ కీపింగ్ చేయగలడు. కేఎల్ రాహుల్ కూడా వికెట్ల వెనుక గోడ మాదిరిగా ఉండగలడు. అయితే రాహుల్ తో పోల్చి చూస్తే కిషన్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అతడు టి20 లో ఆడినప్పటికీ.. వన్డేలలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. మేనేజ్మెంట్ కిషన్ వైపు ఆసక్తిగా చూస్తోంది. గంభీర్ కు కూడా కిషన్ మీద విపరీతమైన నమ్మకం ఉంది. అందువల్ల కిషన్ కు చోటు కల్పిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. మరి కాసేపట్లో కోహ్లీ స్థానంలో ఎవరు ఆడుతారో తేలిపోతుంది.
ధర్మశాల మైదానంలో కిషన్ కు మంచి రికార్డు ఉంది.. ఈ మైదానం మీద అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలడు. గతంలో డొమెస్టిక్ టోర్నీలలో అతడు ఇక్కడ ఆడాడు.. ఐపీఎల్ లో ముంబై.. హైదరాబాద్ జట్టు తరఫున ధర్మశాల మైదానం మీద అతడు ఆడాడు. ఈ ప్రకారం కిషన్ కు కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం మేనేజ్మెంట్ కల్పిస్తుందని తెలుస్తోంది.

