IND A vs PAK A: ఆసియా కప్ రైసింగ్ స్టార్స్ 2025లో భాగంగా భారత్ ఏ, పాకిస్తాన్ ఏ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా అభిమానులు ఊహించని ఫలితం వచ్చింది. ఈ ఫలితంతో యావత్ దేశ క్రికెట్ అభిమానులు మొత్తం ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అసలు ఇలా జరిగిందని చర్చించుకోవడం మొదలుపెట్టారు.. అంతేకాదు టీమ్ ఇండియా ప్లేయర్ల ఆట తీరు పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఖతార్ లోని దోహ ప్రాంతంలో వెస్ట్ అండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది.. ప్రత్యర్థి జట్టును ఓడించాల్సిన సమయంలో టీమిండియా చేష్టలుడిగి చూసింది. అది కాస్త ఊహించని ఫలితం ఇచ్చింది. దీంతో టీమిండియా ప్లేయర్లు.. అభిమానులు తలలు పట్టుకున్నారు.
ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా టాస్ ఓడిపోయింది. పిచ్ పరిస్థితి అంచనా వేసిన పాకిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు 19 ఓవర్లలో 136 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య పది పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వైభవ్ సూర్య వంశీ, నమన్ రెండో వికెట్ కు 49 రన్స్ భాగస్వామ్యం నిర్మించారు. సూర్య వంశీ 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత టీమిండియా బ్యాటర్లు వరుసగా అవుట్ అయ్యారు. 35 పరుగులకు టీమిండియా తన చివరి 7 వికెట్లు కోల్పోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి 10 ఓవర్ ముగిసే సమయానికి టీం ఇండియా స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 91 పరుగులుగా ఉంది. కానీ ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు విఫలం కావడంతో టీమిండియా తక్కువ పరుగులు మాత్రమే చేయగలిగింది.. పాకిస్తాన్ జట్టులో షహిద్ అజీజ్ మూడు వికెట్లు పడగొట్టాడు.
లక్ష్యాన్ని చేదించడంలో పాకిస్తాన్ జట్టు దూకుడుగా బ్యాటింగ్ చేసింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి.. 14 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ మాజ్ సాదఖత్ అర్థ శతకం చేసి అదరగొట్టాడు.. 47 బంతుల్లోనే అతడు 79 పరుగులు చేశాడు. నాట్ అవుట్ గా నిలిచాడు. పాకిస్తాన్ జట్టు ఇండియా విధించిన టార్గెట్ ను కేవలం 13.2 ఓవర్ లోనే ఫినిష్ చేసింది.. టీ మీడియా పై విజయం సాధించడంతో పాకిస్తాన్ సెమీఫైనల్ లో ప్రవేశించింది. మరోవైపు ఈ టోర్నీలో నిలబడాలంటే టీమిండియా కచ్చితంగా తదుపరి మ్యాచ్ గెలవాలి. ఇక గ్రూప్ బి నుంచి సెమీఫైనల్ చోటు కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. ఇండియా – ఏ, ఒమన్, యూఏఈ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. నవంబర్ 18న ఒమన్ జట్టుతో టీమిండియా పోటీ పడుతుంది. సెమీ ఫైనల్ వెళ్లాలంటే టీ మీడియా ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలవాలి. ఈ మ్యాచ్లో వచ్చే ఫలితం, యూఏఈ ప్రదర్శన.. గ్రూప్ బీ నుంచి రెండవ అర్హత సాధించే జట్టును ఖరారు చేస్తాయి.
Pakistan A defeated India A by just 8 wickets in ACC Men’s Asia Cup Rising Stars 2025! #INDvPAK pic.twitter.com/oV0J1zYABz
— ICC Asia Cricket (@ICCAsiaCricket) November 16, 2025