T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ లో.. సెమీస్ చేరే జట్లు ఇవే..

అంబటి రాయుడి దృష్టిలో.. టీమిండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు సెమీస్ చేరుకుంటాయట.. అయితే అంబటి రాయుడు తన జాబితాలో ఆస్ట్రేలియా జట్టును చేర్చకపోవడం విశేషం.

Written By: Anabothula Bhaskar, Updated On : May 29, 2024 8:39 am

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. వెస్టిండీస్, అమెరికా వేదికగా వచ్చే నెల నుంచి పొట్టి క్రికెట్ పండుగ మొదలుకానుంది. టీమిండియా జూన్ 5 నుంచి తన టి20 ప్రపంచ కప్ వేటను ప్రారంభించనుంది. ఐర్లాండ్ జట్టుతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టి20 వరల్డ్ కప్ లో సెమీ ఏ ఏ జట్లు చేరుతాయోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే మాజీ క్రికెటర్లు తమ అంచనాలను వెల్లడించారు. ఇంతకీ ఆ జట్లు ఏమిటంటే..

అంబటి రాయుడి దృష్టిలో.. టీమిండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు సెమీస్ చేరుకుంటాయట.. అయితే అంబటి రాయుడు తన జాబితాలో ఆస్ట్రేలియా జట్టును చేర్చకపోవడం విశేషం.

ఇక బ్రయాన్ లారా టీమిండియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ జట్లను సెమిస్ చేరుతాయని ప్రకటించాడు. ఇతడు కూడా ఆస్ట్రేలియా జట్టును లెక్కలోకి తీసుకోకపోవడం విశేషం.

పాల్ కాలింగ్ వుడ్ విశ్లేషణలో టీమిండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండిస్ జట్లు సెమిస్ చేరుతాయట. అయితే ఈ జాబితాలో న్యూజిలాండ్ జట్టును అతడు చేర్చకపోవడం విశేషం.

సునీల్ గవాస్కర్ కోణంలో ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు సెమిస్ చేరేందుకు అవకాశం ఉందట.

క్రిస్ మోరీస్ అంచనా ప్రకారం ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఇస్తాన్, ఆస్ట్రేలియా జట్లు మాత్రమే సెమిస్ చేరేందుకు అవకాశం ఉందట.

మాథ్యూ హెడెన్ అంచనా ప్రకారం ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్టు మాత్రమే సెమిస్ వెళ్లేందుకు అవకాశం ఉందట.

అరోన్ ఫించ్ అంచనా ప్రకారం ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు మాత్రమే సెమిస్ చేరుతాయట..

టామ్ మూడీ విశ్లేషణ ప్రకారం ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు మాత్రమే సెమీ చేరేందుకు అర్హత కలిగి ఉన్నాయట.

శ్రీశాంత్ వ్యూ ప్రకారం ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ సెమిస్ చేరుతాయట.

మహమ్మద్ కైఫ్ అంచనా ప్రకారం ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లకు సెమీస్ చేరేందుకు అర్హత ఉందట.

దిగ్గజ ఆటగాళ్లు చెప్పిన విశ్లేషణ ప్రకారం.. అందరూ ఇండియా జట్టుకు జై కొట్టారు. ఇండియా తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఆ తర్వాత ఇంగ్లాండు ఉంది. పాకిస్తాన్ వైపు మాత్రం మహమ్మద్ కైఫ్, శ్రీశాంత్ మాత్రమే మొగ్గు చూపించారు.

అయితే ఈసారి సెమిస్ మాత్రమే కాదు.. టీమిండియా కప్ కూడా సాధిస్తుందని కొంతమంది క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత వరల్డ్ కప్ లో భారత జట్టు సెమిస్లో ఓడిపోయిందని.. వన్డే వరల్డ్ కప్ లోనూ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయిందని.. ఈసారి టి20 వరల్డ్ కప్ లో ఆడే భారత జట్టు సమతూకంగా ఉందని.. విజయమో వీర స్వర్గమో అనేలాగా రోహిత్ సేన ఆడటం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.