IND Vs END T20 Match
IND Vs END T20 Match : పూణే లో జరిగిన టి20 మ్యాచ్లో హార్దిక్ పాండ్యా (30 బంతుల్లో 53), శివమ్ దూబే(31 బంతుల్లో 52*) శివతాండవం చేశారు.. ఎవరినీ వదిలిపెట్టకుండా దండయాత్ర చేశారు. పాండ్యా నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు, దూబే ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టి అదరగొట్టారు. షకీబ్ మహమూద్, అదిల్ రషీద్ ను కూడా వదిలిపెట్టలేదు.. వాస్తవానికి ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ మొదట్లో దారుణంగా తడబడింది. కనీసం 100 పరుగులైనా చేస్తుందా అనే పరిస్థితి నెలకొంది. హార్దిక్ పాండ్యా, దూబే టీమిండియా బ్యాటింగ్ లైనప్ కు తిరుగులేని బూస్టప్ ఇచ్చారు. మెన్ ఇన్ బ్లూ లో తిరుగు లేని విశ్వాసాన్ని నింపారు. వచ్చే ఏడాది భారత్- శ్రీలంక వేదికగా టీ 20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు శివం దూబే – హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ మెమొరబుల్ గా నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
కసిని పెంచారు
పూణే మ్యాచ్లో 10.4 ఓవర్ వద్ద టీమ్ ఇండియా 79 పరుగుల వద్ద రింకూ సింగ్(30) అదిల్ రషీద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అప్పటికి భారత్ 5 వికెట్లను కోల్పోయింది. సంజు శాంసన్(1), అభిషేక్ శర్మ (29), సూర్య కుమార్ యాదవ్(0), తిలక్ వర్మ(0) ఇలా వెంట వెంటనే అవుట్ కావడంతో టీమిండియా తీవ్రమైన కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే తిరుగులేని ఆట తీరు ప్రదర్శించారు. వీరిద్దరూ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ 45 బంతుల్లో 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ ధైర్యంగా ఆడటం వల్ల టీ మీడియాకు ఎదురనేది లేకుండా పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వాస్తవానికి ఒకానొక దశలో టీమ్ ఇండియా 100 పరుగులైనా చేస్తుందా అనే అనుమానం కలిగింది. కానీ హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వికెట్లు పడుతున్న చోట ధైర్యంగా నిలబడి.. బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడారు. 79/5 నుంచి 166/6 వద్దకు టీమిండియా ను తీసుకెళ్లారు. ఆ దశలో హార్దిక్ పాండ్యా అవుట్ అయినప్పటికీ..శివమ్ దూబే తన బ్యాటింగ్ పరాక్రమాన్ని కొనసాగించాడు. మొత్తంగా టీమ్ ఇండియా 181/9 పరుగులు చేసింది.. అయితే ఈ టార్గెట్ చేజ్ చేయడంలో ఇంగ్లాండ్ జట్టు బలంగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. తొలి వికెట్ కు డకెట్, సాల్ట్ 62 పరుగులు జోడించినప్పటికీ.. అదే ఊపు ఇంగ్లాండ్ జట్టు చివరి వరకు కొనసాగించలేకపోయింది. టీమిండియా బౌలర్లు దూకుడుగా బౌలింగ్ చేయడంతో.. ఇంగ్లాండ్ జట్టు గెలుపు వాకిట బోల్తా పడింది. మొదట్లో బ్యాటింగ్లో తడబడి.. బౌలింగ్ లోనూ ఇబ్బంది పడిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత పుంజుకుంది. చివరి వరకు పట్టును వదలకుండా.. మ్యాచ్ ను కాపాడుకుంది. అదే కాదు పోరాటపటి మన ప్రదర్శించి సిసలైన జెంటిల్మెన్ గేమ్ ఆడింది.
Dube is back in blue with bang! #PlayBold #ನಮ್ಮRCB #INDvENG
pic.twitter.com/2kiXeuyOSo— Royal Challengers Bengaluru (@RCBTweets) January 31, 2025
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: If this momentum continues team india will win the 2026 t20 world cup
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com