India Vs Australia: ఏషియా కప్ సక్సెస్ ఫుల్ గా ముగిసిన సందర్భంగా ఇండియా మంచి సంబరాలను చేసుకుంటుంది. అయితే ఈరోజు ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఒక వన్డే మ్యాచ్ జరగనుంది. మొత్తం 3 వన్డే మ్యాచ్ లు కాగా అందులో మొదటిది ఈరోజు జరగనుంది అయితే ఇవాళ్ల జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇండియా ఆస్ట్రేలియాని ఓడిస్తే ఇండియా నెంబర్ వన్ టీం గా అవతరిస్తుంది.అలాగే ఇండియా ఇప్పటికే టి20 ల్లో, టెస్టుల్లో నెంబర్ వన్ టీమ్ గా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో కూడ గెలిస్తే మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ టీమ్ గా ఇండియా అవతరిస్తుంది. దాంతో ఏక కాలం లో మూడు ఫార్మాట్లలో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్న టీం గా ఇండియా ఒక మంచి రికార్డ్ ని సొంతం చేసుకుంటుంది… అయితే ఇప్పటికి వన్డేల్లో పాకిస్తాన్ నెంబర్ వన్ టీం గా కొనసాగుతుంది.
అయితే ఈ ఒక్క మ్యాచ్ లో కనుక ఇండియా విజయం సాధిస్తే పాకిస్తాన్ ని వెనక్కి నెట్టి ఇండియా నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఈ మ్యాచ్ లో మనం గెలవాలంటే మన బౌలర్లు ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్స్ ని ఎక్కువగా స్కోర్ చేయకుండా తక్కువ స్కోర్ కే కట్టడి చేయగలిగితే సగం వరకు మనం ఈ మ్యాచ్ గెలిచినట్టే…అయితే మన బ్యాట్స్ మెన్స్ కూడా బాగా ఆడుతూ ఆస్ట్రేలియన్ పేస్ బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే ఇండియా టీం ఈజీగా ఈ మ్యాచ్ లో గెలుస్తుంది… ఇక ఇప్పటికే వన్డే బౌలింగ్లో సిరాజ్ నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్నాడు. ఇక మన టీం కూడా నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్తే ఒకే టైంలో మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ టీం గా ఉన్న టీమ్ లు ఇప్పటివరకు లేవనే చెప్పాలి. దాంతో ఇండియా టీం కనుక ఈ ఫీట్ ని సాధిస్తే మూడు ఫార్ముట్లలో నెంబర్ వన్ టీం గా ఉన్న మన టీమ్ చాలా రికార్డులను క్రియేట్ చేస్తుంది అనే చెప్పాలి…