Homeక్రీడలుక్రికెట్‌ICC men's T20 world cup: పాక్ ఆటగాళ్ల వీసాలను పక్కన పెట్టిన భారత్.. ఏం...

ICC men’s T20 world cup: పాక్ ఆటగాళ్ల వీసాలను పక్కన పెట్టిన భారత్.. ఏం జరిగిందంటే?

ICC Mens T20 World Cup: వచ్చే నెల నుంచి శ్రీలంక, భారత్ సంయుక్తంగా టి20 వరల్డ్ కప్ (ICC mens T20 World Cup) నిర్వహించనున్నాయి. ఈ టోర్నీ కి సంబంధించి భారత్, శ్రీలంక క్రికెట్ జట్ల యాజమాన్యాలు ఏర్పాట్లను ముమ్మరంగా చేపడుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన ఒక కీలకమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ సంతతికి చెందిన నలుగురు అమెరికా ప్లేయర్లకు వీసాల జారీకి సంబంధించి జాప్యం ఏర్పడింది. దీనిపై జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి కథనాలు వస్తున్నాయి. పాకిస్తాన్ సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ల పేర్లు అలీ ఖాన్, జహంగీర్, మహమ్మద్ మోహ్సిన్ , ఆదిల్. భారత్ తమ వీసా నిరాకరించిందని ఆదిల్ ఒక స్టోరీ రూపొందించి.. దానిని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

పాకిస్తాన్ సంతతికి చెందిన అమెరికా ప్లేయర్లకు సంబంధించిన వీసాల జారీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలుస్తోంది. కొలంబోలో ప్రస్తుతం అమెరికా జట్టు ఉంది. మిగతా ప్లేయర్లకు సంబంధించిన వీసా ప్రక్రియ అక్కడి భారత హై కమిషన్ పర్యవేక్షిస్తోంది. అయితే ఆ నలుగురు పాక్ సంతతికి చెందిన ప్లేయర్ల వీసాల జారీకి సంబంధించిన ప్రక్రియ మాత్రం ఆలస్యం అవుతుంది.

” ప్రస్తుతం వారు శ్రీలంకలోని భారత హై కమిషన్ కార్యాలయంలో అనుమతి తీసుకున్నారు. ఇటువంటి క్రమంలో వీసాలు ప్రాసెస్ చేయడం సాధ్యం కాదని ఆ ప్లేయర్లకు సమాచారం వచ్చింది. అనంతరం అమెరికా మేనేజ్మెంట్ కు భారత హై కమిషన్ కార్యాలయం ఫోన్ చేసింది. కావలసిన సమాచారాన్ని కొంతవరకు మాత్రమే ఇచ్చారని.. ఫారెన్ మినిస్ట్రీ నుంచి ఇంకా అదనపు సంవత్సరం రావాల్సి ఉందని” భారత వర్గాలు చెప్పినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి

ఈ వ్యవహారంపై భారత అధికారులు ఇప్పటికే స్పందించారు.. “పాకిస్తాన్ మూలాలు ఉన్న ప్లేయర్లకు సంబంధించిన వీసాల జారీ ప్రక్రియ ప్రత్యేక కేటగిరీ కింద ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ఇదంతా జరుగుతుంది. గతంలో బషీర్, ఖవాజ, మొయిన్ అలీ వంటి ప్లేయర్లకు సంబంధించిన వీసాల జారీ విషయంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేశాం. దీనికి సంబంధించి ఇండియన్ ఫారిన్ మినిస్ట్రీ నుంచి గ్రీన్ సిగ్న లభించాల్సి ఉందని” భారత అధికారులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version