Haris Rauf: ఇటీవల ఆసియా కప్ లో భాగంగా టీమ్ ఇండియాతో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్ రౌఫ్ అభ్యంతరకర సంకేతాలు చేశాడు. రఫెల్ జెట్ విమానాలను పోల్చామని అతడు సంకేతాలు ఇచ్చాడు. ఇది తీవ్ర అభ్యంతరకరంగా ఉందని.. ఇప్పటికే బీసీసీఐ ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. ఇటువంటి పరిణామాలు రెండు దేశాల మధ్య ఉన్న వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చుతాయని పేర్కొంది.
రౌఫ్ సంకేతాల నేపథ్యంలో ఐసీసీ తీవ్రమైన చర్యలు తీసుకుందని.. ఏకంగా మూడు మ్యాచ్ లలో అతడు ఆడకుండా నిషేధం విధించిందని.. మ్యాచ్ ఫీజులు కూడా నూరు శాతం కోత విధించిందని వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ ఫైనల్ వెళ్లిపోయిన నేపథ్యంలో.. ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వాస్తవానికి రౌఫ్ పై తీసుకున్న చర్యలకు సంబంధించి ఐసీసీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కనీసం ఎటువంటి సమాచారాన్ని కూడా లీక్ చేయలేదు. అలాంటప్పుడు ఇది నిజమా? అబద్ధమా? అనే సంశయం నెలకొంది.
వాస్తవానికి ఐసీసీ రౌఫ్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి అతనిపై ఐసీసీ ఫిర్యాదు స్వీకరించింది. క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే సమావేశం అయింది. అతడు ఆరోజు మైదానంలో చేసిన సంకేతాలను కమిటీ పరిశీలించింది. అయితే ఆ సంకేతాలు అభ్యంతరకరంగా ఉండడంతో చర్యలు తీసుకునే అవకాశాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే టీమిండియా, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో రౌఫ్ పై ఒకవేళ ఐసీసీ చర్యలు తీసుకుంటే.. అది దాయాది జట్టుకు ఇబ్బందికరంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
వాస్తవానికి పాకిస్తాన్ క్రికెటర్లు భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓవర్ యాక్షన్ చేశారు. ఇద్దరు ముగ్గురు ప్లేయర్లు దారుణమైన విధంగా ప్రవర్తించారు. ముఖ్యంగా రౌఫ్ భారత ప్లేయర్ల మీది మీదికి వచ్చాడు. అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుంటే.. పటిష్టమైన బంతులు వేయాల్సింది పోయి నోటికి పని చెప్పాడు. దీంతో అభిషేక్ శర్మ మరింత రెచ్చిపోయి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో దుమ్మురేపాడు.. ఆ మ్యాచ్లో అభిషేక్ శర్మ దూకుడు వల్ల టీమిండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
HARIS RAUF – BANNED FOR 3 MATCHES
– ICC is going to impose a 3 match ban on Haris Rauf including 100% match fees from 21st sept match for bringing “War References” to the Cricket Ground & misbehaving with fans
– What’s your take #INDvsPAK pic.twitter.com/TtIfmlSVSY
— Richard Kettleborough (@RichKettle07) September 26, 2025